తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్టీసీ బస్సుల్లో (RTC BUSES) మహిళలకు ఉచిత ప్రయాణం (Free Journey) కల్పించారు. దీంతో బస్సులలో ఆక్యుపెన్సీ పెరిగిపోయింది. బస్సుల్లో 60-70 శాతం మహిళా ప్రయాణికులే ఉంటున్నారు. ఈ క్రమంలో మగవారికి సీట్లు, బస్సుల్లో ఎక్కేందుకు చోటు దొరకడంలేదని అక్కడక్కడ నిరసనలు తెలుపుతున్నారు
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్టీసీ బస్సుల్లో (RTC BUSES) మహిళలకు ఉచిత ప్రయాణం (Free Journey) కల్పించారు. దీంతో బస్సులలో ఆక్యుపెన్సీ పెరిగిపోయింది. బస్సుల్లో 60-70 శాతం మహిళా ప్రయాణికులే ఉంటున్నారు. ఈ క్రమంలో మగవారికి సీట్లు, బస్సుల్లో ఎక్కేందుకు చోటు దొరకడంలేదని అక్కడక్కడ నిరసనలు తెలుపుతున్నారు. ఈ మధ్యే ఆర్టీసీ బస్సుల్లో మగవారికి సీట్లు కేటాయించాలని ఓ బస్సు ఎదుట యువకుడు ధర్నా కూడా చేశాడు. అయితే తాజాగా మరో ఘటన చోటు చేసుకుంది. వివరాలు చూస్తే..
ఆదిలాబాద్ (Adilbad) ఆర్టీసీ డిపో కండక్టర్‌పై ఓ ప్రయాణికుడు దాడి చేశాడు. అంతేకాదు ఆ కండక్టర్ చెంపను కొరికాడు. ఆదిలాబాద్ డిపో బస్సు మహారాష్ట్రలోని పాండ్రకవడకు వెళ్లి తిరిగి వస్తుండగా.. బార్డర్‌లో ఉన్న బోరి బస్టాప్ దగ్గర హుస్నాపూర్‌కు చెందిన అజీంఖాన్ (Azim Khan) అనే ప్రయాణికుడు బస్సు ఎక్కి టికెట్ తీసుకున్నాడు. ఆదిలాబాద్‌కు వెళ్లేందుకు టికెట్ కొనుగోలు చేశాడు. బస్సులో ప్రయాణికులు నిండిపోయారు. దీంతో కండక్టర్ ఖాన్‌తో (Khan) గొడవపడ్డాడు. సీటు దొరకలేదని తన డబ్బులు తనకు తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశాడు. దీంతో అంతనికి డబ్బులు తిరిగి ఇచ్చేసి బస్సు నుంచి కిందకు దింపేశాడు. మరోవాహనంలో అజీంఖాన్ వెళ్లిపోయాడు. పిప్పల్‌కోటి (Pippalkoti)వరకు వచ్చి బస్సును ఆపి ఎక్కి మరోసారి కండక్టర్‌తో ఘర్షణకు దిగాడు. కండక్టర్‌తో వాదనలు పెరిగాయి.. ఆగ్రహంతో కండక్టర్‌ను నెట్టిపడేసి చెంపమీద కొరికాడు. అజీంఖాన్‌పై బాధిత కండక్టర్ ఆదిలాబాద్ టూటౌన్ పోలీసులకు (Two Town Police) ఫిర్యాదు చేశాడు.