ఇటలీలోని(Italy) బోలోగ్నాలో 12వ శతాబ్దంలో నిర్మించిన గరిసెండా టవర్‌(Garisenda tower) ప్రమాదంలో పడింది. పీసా టవర్‌ను(Pisa tower) ఈ టవర్‌లో ఒకటి కూలిపోతుందన్న భయంతో అధికారులు సీల్‌ చేశారు. 154 అడుగుల ఎత్తు ఉన్న ఈ టవర్‌ నాలుగు డిగ్రీల కోణంలో(Angle) వంగడాన్ని అధికారులు గుర్తించి సీల్‌ చేశారు. ఈ గరిసెండా టవర్‌ కూలిపోతే శిథిలాలను తొలగించేందుకు వీలుగా చుట్టూ 5 మీటర్లు (16 అడుగులు) ఎత్తయిన బ్యారియర్‌ నిర్మాణానికి పూనుకున్నారు. ఈ టవర్‌ పరిస్థితి అత్యంత క్లిష్టంగా మారిందని బోలోగ్నా నగర కౌన్సిల్ ప్రకటించింది. బోలోగ్నాలో గరిసెండ, అసినెల్లి(Asinelli) అనే టవర్లు చాలా ప్రసిద్ధి పొందాయి. అసివెల్లి టవర్‌, గరిసెండా కంటే రెండు రెట్లు ఎత్తులో వాలుగా ఉంటుంది. ఈ రెండు నిర్మాణాలను 1109-1119 మధ్య నిర్మించారు.

ఇటలీలోని(Italy) బోలోగ్నాలో 12వ శతాబ్దంలో నిర్మించిన గరిసెండా టవర్‌(Garisenda tower) ప్రమాదంలో పడింది. పీసా టవర్‌ను(Pisa tower) ఈ టవర్‌లో ఒకటి కూలిపోతుందన్న భయంతో అధికారులు సీల్‌ చేశారు. 154 అడుగుల ఎత్తు ఉన్న ఈ టవర్‌ నాలుగు డిగ్రీల కోణంలో(Angle) వంగడాన్ని అధికారులు గుర్తించి సీల్‌ చేశారు. ఈ గరిసెండా టవర్‌ కూలిపోతే శిథిలాలను తొలగించేందుకు వీలుగా చుట్టూ 5 మీటర్లు (16 అడుగులు) ఎత్తయిన బ్యారియర్‌ నిర్మాణానికి పూనుకున్నారు.

ఈ టవర్‌ పరిస్థితి అత్యంత క్లిష్టంగా మారిందని బోలోగ్నా నగర కౌన్సిల్ ప్రకటించింది. బోలోగ్నాలో గరిసెండ, అసినెల్లి(Asinelli) అనే టవర్లు చాలా ప్రసిద్ధి పొందాయి. అసివెల్లి టవర్‌, గరిసెండా కంటే రెండు రెట్లు ఎత్తులో వాలుగా ఉంటుంది. ఈ రెండు నిర్మాణాలను 1109-1119 మధ్య నిర్మించారు. పర్యాటకులు(Tourists) ఎక్కడానికి అసినెల్లి టవర్‌ను తెరుస్తుంటారు. అయితే 14వ శతాబ్దంలో గరిసెండా వంగిపోవడం ప్రారంభం కావడంతో దాని ఎత్తును తగ్గించారు. 1321లో డాంటే రాసిన 'దీ డివైన్‌ కామెడీ'లో(The devine comedy) ఈ టవర్‌ గురించి రాశారు.గరిసెండా టవర్‌లో మార్పులు కనిపించడంతో ఈ మధ్యనే అధికారులు పరిశీలించారు. టవర్ వంగిందని నిర్ధారించడంతో ఆ ప్రాంతాన్ని అక్టోబర్‌లో(October) మూసివేశారు. ఆ తర్వాత టవర్‌ను రక్షించేదుకు బోలోగ్నా చర్యలు చేపట్టింది. టవర్‌ కూలిపోతే శిథిలాలు చుట్టుపక్కల భవనాలపై పడకుండా బ్యారియర్‌ (Barrier)నిర్మాణానికి పూనుకుంది. 2024 ప్రారంభం నుంచి ఈ బ్యారియర్‌ నిర్మాణం చేపట్టే అవకాశం ఉంది. పునరుద్ధరణ పనులు జరుగుతున్నప్పుడు టవర్, దాని కింద ఉన్న ప్లాజాను(Plaza) మూసివేయాలని ఆలోచిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ కోసం బోలోగ్నా విరాళల(Fund raising) సేకరణ ప్రారంభించింది.

Updated On 5 Dec 2023 6:34 AM GMT
Ehatv

Ehatv

Next Story