సూపర్‌స్టార్(Superstar) రజనీకాంత్ కూతురు(Rajinikanth Daughter) ఐశ్వర్య(Aishwarya) రజనీకాంత్ ఇంట్లో భారీ చోరి జరిగిందన్న వార్త చదివే ఉంటారు. పనిమనిషే నగలు ఎత్తుకెళ్లిందన్న విషయమూ తెలిసే ఉంటుంది. ఇప్పుడు మరో సెలబ్రిటీ ఇంట్లో దొంగలు పడ్డారు. ప్రముఖ గాయకుడు యేసుదాసు కుమారుడు(Yesudas Son ), గాయకుడు విజయ్ యేసుదాసు(Vijay Yesudas)ఇంట్లో దొంగతనం జరిగింది.

Vijay Yesudas
సూపర్‌స్టార్(Superstar) రజనీకాంత్ కూతురు(Rajinikanth Daughter) ఐశ్వర్య(Aishwarya) రజనీకాంత్ ఇంట్లో భారీ చోరి జరిగిందన్న వార్త చదివే ఉంటారు. పనిమనిషే నగలు ఎత్తుకెళ్లిందన్న విషయమూ తెలిసే ఉంటుంది. ఇప్పుడు మరో సెలబ్రిటీ ఇంట్లో దొంగలు పడ్డారు. ప్రముఖ గాయకుడు యేసుదాసు కుమారుడు(Yesudas Son ), గాయకుడు విజయ్ యేసుదాసు(Vijay Yesudas)ఇంట్లో దొంగతనం జరిగింది. చెన్నై(Chennai)లోని అభిరామపురంలో విజయ్ నివాసం ఉంది. ఆ ఇంటి నుంచి 60 సవర్ల బంగారు నగలు, వజ్రాభరణాలను దొంగలు ఎత్తుకెళ్లారు. పనిలో పనిగా కొన్ని డాక్యుమెంట్లను కూడా తమతో తీసుకెళ్లారు. విజయ్ భార్య దర్శన పోలీసులకు కంప్లయింట్ చేశారు. తమ ఇంట్లో పని చేస్తున్న వారే దొంగతనానికి పాల్పడి ఉంటారని ఆమె అనుమానం వ్యక్తం చేస్తన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. యేసుదాసు కుమారుడిగా సినిమాల్లో అడుగుపెట్టిన విజయ్ చిరకాలంలోనే తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నారు. గాయకుడిగానే కాదు, నటుడిగా కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు.
