Russia Missile Attcks On Ukrain : జెలెన్‌స్కీ సొంత నగరంపై క్షిపణి దాడులు, ఆరుగురి మృతి
రష్యా-ఉక్రెయిన్(Russia-Ukrain) మధ్య యుద్ధం ఇప్పట్లో ముగిసేలా లేదు. రెండు దేశాలు పరస్పరం దాడులు చేసుకుంటూనే ఉన్నాయి. ఉక్రెయిన్ ఎదురుదాడులకు గట్టి జవాబు ఇచ్చేందుకు క్షిపణి దాడులను(Missile attacks) ఉధృతం చేసింది రష్యా. సోమవారం ఉదయం ఏకంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సొంత నగరం క్రివిరిహ్‌పై క్షిపణులతో విరుచుకుపడింది.
రష్యా-ఉక్రెయిన్(Russia-Ukrain) మధ్య యుద్ధం ఇప్పట్లో ముగిసేలా లేదు. రెండు దేశాలు పరస్పరం దాడులు చేసుకుంటూనే ఉన్నాయి. ఉక్రెయిన్ ఎదురుదాడులకు గట్టి జవాబు ఇచ్చేందుకు క్షిపణి దాడులను(Missile attacks) ఉధృతం చేసింది రష్యా. సోమవారం ఉదయం ఏకంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సొంత నగరం క్రివిరిహ్‌పై క్షిపణులతో విరుచుకుపడింది. రష్యా(Russia) ప్రయోగించిన రెండు క్షిపణుల దాడుల్లో పదేళ్ల బాలికతో పాటు ఆరుగురు చనిపోయారు. 75 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడుల్లో ఓ అపార్ట్‌మెంట్, నాలుగు అంతస్తుల యూనివర్సిటీ భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయ. పలు వాహనాలు ధ్వంసమయ్యాయ. జనవాసాలపై దాడులు చేయకూడదన్న నియమం ఉన్నా రష్యా దాన్ని ఉల్లంఘించిందని ఉక్రెయిన్ మంత్రి ఆరోపిస్తున్నారు. రష్యా మాత్రం తాము ఉక్రెయిన్ సైనిక స్థావరాలపైనే దాడులు చేస్తున్నట్టు చెబుతోంది. రష్యా పాక్షికంగా ఆక్రమించిన డొనెట్‌స్క్ ప్రావిన్స్‌లో జరిగిన దాడిలో ఇద్దరు చనిపోయారు. మరో ఆరుగురు గాయపడ్డారు. కాగా ఆదివారం మాస్కోపైకి డ్రోన్లను ప్రయోగించిన ఉక్రెయిన్ సోమవారం రష్యాలోని బ్రియన్‌స్క్‌పై దాడి చేసింది.