Blue Whale : ఒడ్డుకు కొట్టుకొచ్చిన ఐదు టన్నుల తిమింగలం
శ్రీకాకుళం(Srikakulam) జిల్లాలో సముద్ర తీరానికి ఐదు టన్నుల బరువుగల అరుదైన నీలి తిమింగలం(Blue Whale) కొట్టుకొచ్చింది. సంతబొమ్మాళి మండలం డి. మరువాడ సమీపంలోని సముద్రతీరానికి ఈ భారీ నీలి తిమింగలం కొట్టుకువచ్చింది. ఈ భారీ తిమింగళం 25 అడుగులు పొడవు, 5 టన్నులు బరువు ఉంటుందని మత్స్యకారులు చెబుతున్నారు.
శ్రీకాకుళం(Srikakulam) జిల్లాలో సముద్ర తీరానికి ఐదు టన్నుల బరువుగల అరుదైన నీలి తిమింగలం(Blue Whale) కొట్టుకొచ్చింది. సంతబొమ్మాళి మండలం డి. మరువాడ సమీపంలోని సముద్రతీరానికి ఈ భారీ నీలి తిమింగలం కొట్టుకువచ్చింది. ఈ భారీ తిమింగళం 25 అడుగులు పొడవు, 5 టన్నులు బరువు ఉంటుందని మత్స్యకారులు చెబుతున్నారు. ఇలాంటి భారీ తిమింగలాలు బంగాళాఖాతంలో చాలా అరుదుగా ఉంటాయని.. లోతులేని చోట నీటిలోకి వచ్చి చనిపోయి ఉండవచ్చని మత్స్యకారులు భావిస్తున్నారు. ఈ భారీ తిమింగళాన్ని చూసేందుకు సముద్రతీరానికి భారీ జనాలు వస్తున్నారు. తిమింగళం పైన నిల్చొని, పక్కన నిలబడి ఫోటోలకు ఫోజులిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.