కర్ణాటకలోని(Karnataka) చిత్రదుర్గ జిల్లాలో ఉన్న ఓ పడావుబడ్డ ఇంట్లో ఐదు అస్థిపంజరాలు లభ్యమయ్యాయి. ఈ అస్థిపంజరాలన్నీ ఒకే కుటుంబానికి చెందినవిగా స్థానికులు చెప్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు(Police).. ఓ గదిలో నాలుగు అస్థిపంజరాలు ఇందులో మంచాలపై రెండు, నేలపై రెండు ఉన్నాయి. మరో గదిలో మరో అస్థిపంజరం(Skeletal) కనిపించింది. ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (FSL) బృందం, సీన్ ఆఫ్ క్రైమ్ ఆఫీసర్స్ సాక్ష్యాలను సేకరించారు. ఆ ఇంటి చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేశారు.

కర్ణాటకలోని(Karnataka) చిత్రదుర్గ జిల్లాలో ఉన్న ఓ పడావుబడ్డ ఇంట్లో ఐదు అస్థిపంజరాలు లభ్యమయ్యాయి. ఈ అస్థిపంజరాలన్నీ ఒకే కుటుంబానికి చెందినవిగా స్థానికులు చెప్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు(Police).. ఓ గదిలో నాలుగు అస్థిపంజరాలు ఇందులో మంచాలపై రెండు, నేలపై రెండు ఉన్నాయి. మరో గదిలో మరో అస్థిపంజరం(Skeletal) కనిపించింది. ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (FSL) బృందం, సీన్ ఆఫ్ క్రైమ్ ఆఫీసర్స్ సాక్ష్యాలను సేకరించారు. ఆ ఇంటి చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేశారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడతామని పోలీసులు చెప్పారు. ఈ ఇంట్లో పలు అనుమానాస్పద(Suspecious) విషయాలు ఉన్నాయని పోలీసులు చెప్తున్నారు.

ఈ ఇంట్లో ఓ కుటుంబం ఒంటరిగా ఉండేదని, తీవ్ర అనారోగ్య(Health issues) సమస్యలతో సతమతమవుతుండేవారని బంధువులు పోలీసులకు తెలిపారు. వీరు చివరగా జులై -2019లో కనిపించారు. అప్పటి నుంచి ఆ ఇంటికి(House) తాళం వేసే ఉంది. ఇంటి మెయిన్‌ డోర్‌ తలుపు పగిలిపోయి ఉండటాన్ని రెండు నెలల క్రితం స్థానికులు గుర్తించారు. అయినప్పటికీ స్థానికులెవరూ పోలీసులకు సమాచారం అందించలేదు. విషయం ఆ నోటా, ఈ నోటా తెలియడంతో పోలీసులు అక్కడికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Updated On 29 Dec 2023 2:42 AM GMT
Ehatv

Ehatv

Next Story