10 Govt Jobs: ఏకంగా 10 ప్రభుత్వ కొలువులు కొట్టేసిన యువకుడు..!

ఈ ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం సులువైన పని కాదు. కానీ ఇంత కాంపిటీషన్‌లో కూడా ఒక యువకుడు ఏకంగా 10 నౌకర్లను తన జేబులో వేసుకున్నాడు. జయశంకర్‌ భూపాలప జిల్లాలోని గుంటూరుపల్లి గ్రామానికి చెందిన యువకుడు గోపీ కృష్ణ పది ప్రభుత్వ ఉద్యోగాలను సాధించాడు . గోపీ కృష్ణ తన కఠోర శ్రమ, అంకితభావంతో కష్టపడి ఏకంగా 10 ఉద్యోగాలు సాధించుకున్నాడు. తాజాగా గ్రూప్‌-1లో కూడా తన సత్తా చాటాడు. గోపీకృష్ణ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా గ్రూప్‌-1, గ్రూప్‌-2, గ్రూప్‌-3, గ్రూప్‌-4 వంటి వివిధ స్థాయిల్లోని పోస్టులు, అలాగే పోలీస్‌ శాఖ, ఫారెస్ట్‌ శాఖ, ఇతర రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగాలు సాధించాడు. వివిధ దశల్లో నిర్వహించిన పరీక్షల ద్వారా అతను ఈ ఉద్యోగాలు సాధించాడు. తాజాగా గ్రూప్‌-1 జనరల్‌ ర్యాంకింగ్స్‌ విడుదల చేసిన నేపథ్యంలో తన సక్సెస్‌ సీక్రెట్‌ను వెల్లడించాడు. ఈ విజయాన్ని సాధించడానికి రోజూ 10-12 గంటలు చదువుకున్నాడని, తన లక్ష్యాలను చేరుకోవడానికి అవిశ్రాంతంగా కృషి చేశానని వివరించాడు. గోపీకృష్ణ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా యువతకు స్ఫూర్తిగా నిలిచింది. అతని ఈ విజయం గురించి తెలిసిన స్థానిక ప్రజలు, అధికారులు అతన్ని అభినందిస్తున్నారు. పలువురు ప్రముఖులు, రాజకీయనాయకులు ఆయనపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

ehatv

ehatv

Next Story