నిరుద్యోగులకు శుభవార్త. ముఖ్యంగా రైల్వేలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నవారికి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. సికింద్రాబాద్‌లోని సౌత్ సెంట్రల్ రైల్వే కాంట్రాక్ట్ పద్దతిలో 35 జూనియర్ టెక్నికల్ అసోసియేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేశారు. అలాగే సరైన అర్హత కలిగి ఉండి.. ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. సివిల్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ అండ్‌ సిగ్నల్ టెలికమ్యూనికేషన్ విభాగాల్లో ఉన్న ఈ ఖాళీలను భర్తీ చేసేందుకు కసరత్తులు చేస్తుంది

నిరుద్యోగులకు శుభవార్త. ముఖ్యంగా రైల్వేలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నవారికి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. సికింద్రాబాద్‌లోని సౌత్ సెంట్రల్ రైల్వే కాంట్రాక్ట్ పద్దతిలో 35 జూనియర్ టెక్నికల్ అసోసియేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేశారు. అలాగే సరైన అర్హత కలిగి ఉండి.. ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. సివిల్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ అండ్‌ సిగ్నల్ టెలికమ్యూనికేషన్ విభాగాల్లో ఉన్న ఈ ఖాళీలను భర్తీ చేసేందుకు కసరత్తులు చేస్తుంది సికింద్రాబాద్ రైల్వే. ఇందులో మొత్తం 35 జూనియర్ టెక్నికల్ అసోసియేట్ పోస్టులు ఉన్నాయి.

అందులో సివిల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ అండ్‌ సిగ్నల్ టెలికమ్యూనికేషన్ విభాగాల్లో ఉన్న పోస్టులకు డిప్లొమా, బీఎస్సీ, ఇంజినీరింగ్‌లో డిగ్రీ (ఐటీ/ సీఎస్/ కంప్యూటర్ ఇంజినీరింగ్/ సివిల్/ మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్) పూర్తి చేసి సంబంధిత విభాగాల్లో పనిచేసిన అనుభవం ఉండాలి. అలాగే అభ్యర్థుల వయసు 18-33 సంవత్సరాల మధ్య ఉండాలి.

అభ్యర్థులను విద్యార్హతలో సాధించిన మార్కులు, పని అనుభవం, పర్సనాలిటీ/ ఇంటెలిజెన్స్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. "సెక్రటరీ టు ప్రిన్సిపల్ చీఫ్ పర్సనల్ ఆఫీసర్ అండ్‌ సీనియర్ పర్సనల్ ఆఫీసర్ (ఇంజినీరింగ్), ఆఫీస్ ప్రిన్సిపల్ చీఫ్ పర్సనల్ ఆఫీసర్, 4వ అంతస్తు, పర్సనల్ డిపార్ట్‌మెంట్, రైల్ నిలయం, ఎస్‌సీఆర్‌, సికింద్రాబాద్" ఈ చిరునామాకు దరఖాస్తులను జూన్ 30లోపు పంపాలి. పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌:https://scr.indianrailways.gov.in/

Updated On 14 Jun 2023 1:57 AM GMT
Ehatv

Ehatv

Next Story