కెనెడాలో (Canada) ఉన్నత విద్యకోసం వెళ్లాలనుకున్న విద్యార్థులకు కెనడా ప్రభుత్వం షాకిచ్చింది. అంతర్జాతీయ స్టడీ వీసాలను (Study Visa) 35 శాతం తగ్గిస్తున్నట్లు కెనడా ప్రకటించింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపింది.

కెనెడాలో (Canada) ఉన్నత విద్యకోసం వెళ్లాలనుకున్న విద్యార్థులకు కెనడా ప్రభుత్వం షాకిచ్చింది. అంతర్జాతీయ స్టడీ వీసాలను (Study Visa) 35 శాతం తగ్గిస్తున్నట్లు కెనడా ప్రకటించింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపింది. రెండేళ్ల పాటు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మేరకు ఆ దేశల మంత్రి మార్క్‌ మిల్లర్‌ (Mark Miller) ప్రకటించారు. ఇప్పటికే వీసా ఉన్నవారికి ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపారు. ఇది దాదాపు 2023లో 9 లక్షల వీసాల జారీ ఉండగా ఇది ఇప్పుడు 3.60 లక్షలకు దగ్గిపోనున్నాయి. ఇప్పటికే జీఐసీ డిపాజిట్‌ను కెనెడా ప్రభుత్వం 6 లక్షల రూపాయల నుంచి 12 లక్షల వరకు పెంచింది. అయితే తాజా నిర్ణయంతో కెనడా వెళ్లాలనుకున్న విద్యార్థులకు ఎదురుదెబ్బతగిలందనే చెప్పాలి.

Updated On 23 Jan 2024 12:39 AM GMT
Ehatv

Ehatv

Next Story