దేశంలోని నిరుద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. పోస్టల్ డిపార్ట్ టెంట్ నుంచి తాజాగా భారీ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు కేవలం పది పాసైతే చాలు. భారత తపాలా శాఖ ఇటీవల 40వేలకు పైగా గ్రామీణ్ డాక్ సేవక్ (GDS) పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా 12,828 ఉద్యోగాల భర్తీకి పోస్టల్ శాఖ మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ పోస్టల్‌ సర్కిళ్లలోని బ్రాంచి పోస్ట్‌ ఆఫీసుల్లో గ్రామీణ డాక్ సేవక్

దేశంలోని నిరుద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. పోస్టల్ డిపార్ట్ టెంట్ నుంచి తాజాగా భారీ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు కేవలం పది పాసైతే చాలు. భారత తపాలా శాఖ ఇటీవల 40వేలకు పైగా గ్రామీణ్ డాక్ సేవక్ (GDS) పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా 12,828 ఉద్యోగాల భర్తీకి పోస్టల్ శాఖ మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ పోస్టల్‌ సర్కిళ్లలోని బ్రాంచి పోస్ట్‌ ఆఫీసుల్లో గ్రామీణ డాక్ సేవక్ ఖాళీలను భర్తీ చేసేందుకు గత నెలలో ఓ ప్రకటన జారీ చేసింది. ఇందులో స్పెషల్ జీడీఎస్ ఆన్ లైన్ ఎంగేజ్ మెంట్ కింద 5,746 పోస్టులు.. బీపీఎం అండ్ 7,082 ఏబీపీఎం పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునేవారి అర్హతలు, పూర్తి వివరాలను నోటికేషన్ లో పొందుపరిచింది.

అర్హత వివరాలు..
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు కనీసం 10వ తరగతి పాసై ఉండాలి. ఇందులో మ్యాథ్స్‌, ఇంగ్లిష్‌, స్థానిక భాష ఉండటం తప్పనిసరి. ఏపీ, తెలంగాణకు చెందినవారు తెలుగు సబ్జెక్టు పది వరకు చదవి ఉండాల్సిందే.అలాగే వీరికి కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు సైకిల్‌ తొక్కటం వచ్చి ఉండాలి. ఇక ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేవారు 11-06-2023 నాటికి 18-40 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు ఉంటుంది.

ఇక ఈ ఉద్యోగాలకు నెలకు బీపీఎం పోస్టులకు రూ.12,000 - రూ.29,380 ఉంటుంది.. ఏబీపీఎం పోస్టులకు రూ.10,000 - రూ.24,470 వేతనం ఉంటుంది. అభ్యర్థులు పదో తరగతిలో సాధించిన మార్కుల మెరిట్‌ ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేస్తారు. SC, ST, దివ్యాంగులు, ట్రాన్స్‌ఉమెన్‌లకు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. మిగిలిన అభ్యర్థులు రూ.100 చెల్లించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి . పూర్తి వివరాలను ://indiapostgdsonline.gov.in/ సందర్శించండి.

Updated On 14 Jun 2023 1:36 AM GMT
Ehatv

Ehatv

Next Story