తెలంగాణ రాష్ట్రంలో పోలీసు నియామక ప్రక్రియ కొనసాగుతోంది. . ఈక్రమం లోనే పోలీసు శాఖలో ఉద్యోగం పొందాలనుకునే మహిళలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆరోగ్య కారణాల వల్ల దేహదారుఢ్య పరీక్షలకు హాజరుకాలేక పోయిన గర్భిణీలు, బాలింతలకు మరో అవకాశం ఇచ్చింది. ప్రాథమిక పరీక్షలో అర్హత సాధించిన గర్భిణీలు, బాలింతలకు మరోసారి ఫిజికల్ టెస్టులకు హాజరయ్యేందుకు అవకాశం కల్పించింది పోలీసు నియామక మండలి. మెయిన్స్‌లో అర్హత పొందాక గర్భిణీలు, బాలింతలకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది . అయితే […]
తెలంగాణ రాష్ట్రంలో పోలీసు నియామక ప్రక్రియ కొనసాగుతోంది. . ఈక్రమం లోనే పోలీసు శాఖలో ఉద్యోగం పొందాలనుకునే మహిళలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆరోగ్య కారణాల వల్ల దేహదారుఢ్య పరీక్షలకు హాజరుకాలేక పోయిన గర్భిణీలు, బాలింతలకు మరో అవకాశం ఇచ్చింది. ప్రాథమిక పరీక్షలో అర్హత సాధించిన గర్భిణీలు, బాలింతలకు మరోసారి ఫిజికల్ టెస్టులకు హాజరయ్యేందుకు అవకాశం కల్పించింది పోలీసు నియామక మండలి. మెయిన్స్‌లో అర్హత పొందాక గర్భిణీలు, బాలింతలకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది . అయితే ఇందులో పాల్గొనాలంటే మాత్రం మెడికల్ సర్టిఫికెట్లు తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుందని పోలీసు నియామక మండలి అధికారులు స్పష్టం చేశారు. . ఫిబ్రవరి 28వ తేదీ లోపు డీజీపీ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుందని ఆదేశాలు జారీ చేసింది. కాగా, పోలీసు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న తర్వాత గర్భం దాల్చిన స్త్రీలు తమకు మరోసారి అవకాశం కల్పించాలని కోరుతూ కరీంనగర్‌లో ఆందోళన చేపట్టారు. కరీంనగర్‌లోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్ ముందు 40 మంది గర్బిణీ మహిళలు ధర్నా చేపట్టారు. గతంలో కూడా గర్భిణీలకు మరో అవకాశం కల్పించారని చెప్పారు. ఈ నేపథ్యంలో పోలీసు నియామక మండలి తాజాగా, వారందరికీ మరో అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది. మెయిన్స్ పరీక్షలకు హాజరైన తర్వాత వారంతా ఫిజికల్ పరీక్షలకు హాజరుకావొచ్చని వెల్లడించింది. దీంతో అర్హత కలిగిన అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.