సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF)లో రిక్రూట్‌మెంట్ కోసం హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. దాదాపు 1.30 లక్షల కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ-గ్రూప్ సి) పోస్టులను భర్తీ చేయనున్నారు. హోం మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. మొత్తం 1,29,929 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో పురుష అభ్యర్థులకు 1,25,262, మహిళా అభ్యర్థులకు 4,467 పోస్టులు ఉన్నాయి.

హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్‌లో ఈ పోస్టుల ఖాళీల విభజనను వెల్ల‌డించ‌లేదు. దీంతో అభ్యర్థులు సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ 2023 నోటిఫికేషన్, దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం గురించి సీఆర్పీఎఫ్ అధికారిక వెబ్‌సైట్ https://crpf.gov.in/ రిక్రూట్‌మెంట్ పోర్టల్ https://rect.crpf.gov.in/ ను ఫాలో అవ్వాల్సి ఉంటుంది.

జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. గుర్తింపు పొందిన బోర్డు నుండి మెట్రిక్యులేషన్ (10వ త‌ర‌గ‌తి), లేదా దానికి సమానమైన అర్హత కలిగి.. ఈ రిక్రూట్‌మెంట్‌పై ఆసక్తి ఉన్న అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోగలరని సూచించింది. ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల కనీస వయస్సు 18 సంవత్సరాల కంటే తక్కువ ఉండకూడదు. 23 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు. ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, మెడికల్ టెస్ట్, వ్రాత పరీక్ష ద్వారా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది.

ప్రొబేషన్ వ్యవధి 2 సంవత్సరాలు. జీతం ₹21700-69100/ వ‌ర‌కు ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ తేదీలు ఇంకా అధికారిక నోటీసులో వెల్ల‌డించ‌లేదు. సీఆర్పీఎఫ్, మంత్రిత్వ శాఖలు అధికారిక వివరణాత్మక నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత మరిన్ని సంబంధిత వివరాలు తెలిసే అవ‌కాశం ఉంది.

Updated On 6 April 2023 1:32 AM GMT
Ehatv

Ehatv

Next Story