యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) పలు విభాగాల్లో పోస్ట్ ల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది . ఇందులో భాగం గా ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) పోస్ట్ కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానించింది. ప్రస్తుతం 577 ఖాళీలు ఉన్నాయి. ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్/అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఫిబ్రవరి 25నుంచే ఈ రిజిస్ట్రేషన్‌లు ప్రారంభమైనాయి . మార్చి 17 న ముగుస్తాయని తెలిపింది . ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్/అకౌంట్స్ […]

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) పలు విభాగాల్లో పోస్ట్ ల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది . ఇందులో భాగం గా ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) పోస్ట్ కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానించింది. ప్రస్తుతం 577 ఖాళీలు ఉన్నాయి. ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్/అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ఫిబ్రవరి 25నుంచే ఈ రిజిస్ట్రేషన్‌లు ప్రారంభమైనాయి . మార్చి 17 న ముగుస్తాయని తెలిపింది . ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్/అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులకు 418 ఓపెనింగ్స్ ఉండగా, అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్‌కి 159 ఓపెనింగ్స్ ఉన్నాయి. ఏదైనా ఉద్యోగానికి దరఖాస్తు చేయడానికి కనీస వయోపరిమితి 18 సంవత్సరాలు, గరిష్ట వయస్సు 35 సంవత్సరాలు. . ఈ పరీక్ష ఆఫ్‌లైన్‌లో నిర్వహిస్టారు . దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే .....యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ www.upsc.gov.inను లాగిన్ అవ్వొచ్చు .

వెబ్‌సైట్‌లో, 'UPSC EPFO​​ నోటిఫికేషన్' కోసం చూడండి. 'అప్లై నౌ'పై క్లిక్ చేసి, రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలి . తర్వాత .. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, ఇమెయిల్ ఐడీకి, పాస్‌వర్డ్‌ వస్తుంది . ఆ తర్వాత అప్లికేషన్ పోర్టల్‌లో మీ ఐడీ, పాస్‌వర్డ్‌ను నమోదు చేసిన తర్వాత విద్యార్హతల వివరాలను ఫిల్ చేయాలి . ఫోటో, సంతకం స్కాన్ చేసిన కాపీలను అప్‌లోడ్ చేయలి . ఆన్‌లైన్ మోడ్ ద్వారా దరఖాస్తు రుసుముగా రూ.100 చెల్లించండి. దరఖాస్తును సమర్పించి, దరఖాస్తు ఫారమ్ ప్రింటౌట్ తీసుకోవాలి . దరఖాస్తు రుసుము: ఎస్సీ/ ఎస్టీ / PwD/ మహిళా అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే Gen/ OBC/ EWS కేటగిరీల అభ్యర్థులు తప్పనిసరిగా రూ. 25 దరఖాస్తు రుసుమును చెల్లించాలి.

Updated On 27 Feb 2023 8:40 AM GMT
Ehatv

Ehatv

Next Story