బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ) ప్రొబేషనరీ ఆఫీసర్స్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల అయ్యింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ bankofindia.co.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు . అభ్యర్థుల తుది ఎంపిక తర్వాత, వారు బ్యాంక్‌లో చేరడానికి ముందు డిప్లొమా కోర్సు (PGDBM) తప్పనిసరిగా ఉత్తీర్ణులై ఉండాలి. ఈ బీఓఐ రిక్రూట్‌మెంట్ వివరాలు ఇలా ఉన్నాయి . మొత్తం ఖాళీలు 500 పోస్టులు జనరల్ బ్యాంకింగ్ స్ట్రీమ్‌లో క్రెడిట్ ఆఫీసర్: 350 […]

బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ) ప్రొబేషనరీ ఆఫీసర్స్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల అయ్యింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ bankofindia.co.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు . అభ్యర్థుల తుది ఎంపిక తర్వాత, వారు బ్యాంక్‌లో చేరడానికి ముందు డిప్లొమా కోర్సు (PGDBM) తప్పనిసరిగా ఉత్తీర్ణులై ఉండాలి. ఈ బీఓఐ రిక్రూట్‌మెంట్ వివరాలు ఇలా ఉన్నాయి . మొత్తం ఖాళీలు 500 పోస్టులు జనరల్ బ్యాంకింగ్ స్ట్రీమ్‌లో క్రెడిట్ ఆఫీసర్: 350 పోస్టులు స్పెషలిస్ట్ స్ట్రీమ్‌లో ఐటీ ఆఫీసర్: 150 పోస్టులు అర్హతలు: అభ్యర్థి తప్పనిసరిగా సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి.

వయో పరిమితి: అభ్యర్థి వయస్సు ఫిబ్రవరి 1, 2023 నాటికి 20 సంవత్సరాల నుంచి 29 సంవత్సరాల మధ్య ఉండాలి. వయస్సు సడలింపు: SC/ST అభ్యర్థులు: 5 సంవత్సరాలు OBC అభ్యర్థులు: 3 సంవత్సరాలు PwBD: 10 సంవత్సరాలు మాజీ సైనికులు: 5 సంవత్సరాలు ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ పరీక్ష బృంద చర్చ వ్యక్తిగత ఇంటర్వ్యూ జనరల్/ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి కనీస అర్హత మార్కులు 40%. ఆబ్జెక్టివ్ పరీక్షల్లో తప్పు సమాధానాలు గుర్తించినట్లయితే పెనాల్టీ ఉంటుంది. దరఖాస్తు రుసుము: GENERAL/EWS/OBC అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు, ఇంటిమేషన్ ఛార్జీలు రూ. 850, SC/ST/PWD అభ్యర్థులకు ఇంటిమేషన్ ఛార్జీలు రూ. 175. ముఖ్యమైన తేదీలు: దరఖాస్తు ప్రారంభ తేదీ: ఫిబ్రవరి 11, 2023 దరఖాస్తుకు చివరి తేదీ: ఫిబ్రవరి 25, 2023 నోటిఫికేషన్, మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
https://bankofindia.co.in/documents/20121/8561835/FINAL+BOI+ADVT++PGDBF.PDF

Updated On 23 Feb 2023 12:16 AM GMT
Ehatv

Ehatv

Next Story