ITఉద్యోగుల సంఘం నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (NITES) ప్రకారం, 2.5 సంవత్సరాల తర్వాత తమ క్యాంపస్ నియామకాల నుంచి 1,000 ఆఫర్ లెటర్‌లను ఇన్ఫోసిస్(infosys)జారీ చేసింది.

ITఉద్యోగుల సంఘం నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (NITES) ప్రకారం, 2.5 సంవత్సరాల తర్వాత తమ క్యాంపస్ నియామకాల నుంచి 1,000 ఆఫర్ లెటర్‌లను ఇన్ఫోసిస్(infosys)జారీ చేసింది. ఇన్ఫోసిస్ ఇటీవల తన 2022 క్యాంపస్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్(campus Recruitment Drive)నుండి అభ్యర్థులకు 1,000 ఆఫర్ లెటర్‌(Offer letter)లను జారీ చేసింది. ఆఫర్లు తీసుకున్నవారంతా తమ కంపెనీలో జాయిన్‌ అవుతారన్న నమ్మకం ఉందని ఇన్ఫోసిస్ సీఈవో సలీల్‌ పరేఖ్(CEO Sahil Parekh) ప్రకటించారు. సుదీర్ఘ నిరీక్షణకు తెరపడినందుకు ఐటీ ఉద్యోగుల సంఘం సంతోషం వ్యక్తం చేసింది. అయినప్పటికీ, కంపెనీ తన నిబద్ధతను నెరవేర్చడంలో విఫలమైతే, కంపెనీ కార్యాలయం ఎదుట నిరసన నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నట్లు వారు హెచ్చరించారు. దాదాపు రెండు సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న ఈ యువ ఇంజనీర్లు ఇప్పుడు 2024 అక్టోబరు 7న చేరబోతున్నారు.

ehatv

ehatv

Next Story