మొన్నటి వరకు ఐటీ రంగం ఆందోళన కలిగించింది. సంస్థలో ఉన్న ఉద్యోగులను కొంతమందిని తొలగించడంతో చాలా మందిలో తమ జాబ్స్ ఉంటాయో ఊడుతాయో అని భయపడ్డారు సాప్ట్ వేర్ ఎంప్లాయిస్. అలాంటిది ఇప్పుడు టాప్ టెక్ కంపెనీలు భారీగా ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటించాయి. ఈ జాబితాలో మైక్రోసాఫ్ట్, ఫేస్ బుక్, గూగుల్ వంటి పెద్ద సంస్థలు ఉన్నాయి. అయితే ఇప్పటికే ఈ కంపెనీలు వివిధ విభాగాల్లో వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించారు. ప్రపంచవ్యాప్తంగా అమెరికా యూరోపియన్ యూనియన్ […]
మొన్నటి వరకు ఐటీ రంగం ఆందోళన కలిగించింది. సంస్థలో ఉన్న ఉద్యోగులను కొంతమందిని తొలగించడంతో చాలా మందిలో తమ జాబ్స్ ఉంటాయో ఊడుతాయో అని భయపడ్డారు సాప్ట్ వేర్ ఎంప్లాయిస్.
అలాంటిది ఇప్పుడు టాప్ టెక్ కంపెనీలు భారీగా ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటించాయి. ఈ జాబితాలో మైక్రోసాఫ్ట్, ఫేస్ బుక్, గూగుల్ వంటి పెద్ద సంస్థలు ఉన్నాయి. అయితే ఇప్పటికే ఈ కంపెనీలు వివిధ విభాగాల్లో వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించారు. ప్రపంచవ్యాప్తంగా అమెరికా యూరోపియన్ యూనియన్ సహా పలు దేశాలు ఆర్థిక మాంద్యం లాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో టెక్ కంపెనీల ఉత్పత్తి ఖర్చులు పెరిగాయి. దీంతో ఖర్చులను ఆదా చేసుకునేందుకు చాలా కంపెనీలు కొన్ని నెలలుగా ఉద్యోగులను తొలగించే పనిలో ఉన్నాయి.
ఫిబ్రవరిలో భారతదేశంలో నియామకాలు 9 శాతం వరుస వృద్ధిని నమోదు చేసినట్లు నౌక్రి జాబ్‌స్పీక్ డేటా నివేదికలో తెలిపింది . గత కొన్ని నెలలుగా ప్రపంచానికి అనుగుణంగా క్షీణించిన తర్వాత ఐటి రంగం సానుకూల పునరాగమనానికి సంకేతాలు ఇచ్చినట్లు ఆ నివేదికలో తెలిపారు . ఐటి రంగంలో కొత్త ఉద్యోగాల సంఖ్య గత నెలతో పోలిస్తే ఫిబ్రవరిలో 10 శాతం పెరిగాయి. అనలిటిక్స్ మేనేజర్‌లు, బిగ్ డేటా ఇంజనీర్లు, క్లౌడ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్‌లు మరియు ఆగ్మెంటెడ్ రియాలిటీ QA టెస్టర్‌ల వంటి స్పెషలిస్ట్ పాత్రలకు డిమాండ్ వరుసగా 29 శాతం, 25 శాతం, 21 శాతం మరియు 20 శాతం పెరిగింది. ఇంజనీర్ల డిమాండ్ 18 శాతం పెరిగింది. ఇది డేటా సైంటిస్టులు మరియు సాఫ్ట్‌వేర్ డెవలపర్‌ల డిమాండ్‌ను అధిగమించింది. ఇది వరుసగా 17 శాతం మరియు 11 శాతం పెరిగింది. ఈ నియామకాలు మార్చి నుంచి రెట్టింపు కానుందని తెలుస్తోంది.