ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ 2023 గాను వివిధ విభాగాల్లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగంలో 41 జూనియర్ అసోసియేట్, అసిస్టెంట్ మేనేజర్, మేనేజర్, సీనియర్ మేనేజర్, చీఫ్ మేనేజర్ పోస్టుల భర్తీకి విడుదల చేసింది. ఈ పోస్టులకు డిగ్రీ పాసైన వాళ్లు అర్హులు. బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్, బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ, ఎంఎస్‌సీ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎంఎస్‌సీ ఇన్ కంప్యూటర్ సైన్స్, బీసీఏ, ఎంసీఏ […]
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ 2023 గాను వివిధ విభాగాల్లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగంలో 41 జూనియర్ అసోసియేట్, అసిస్టెంట్ మేనేజర్, మేనేజర్, సీనియర్ మేనేజర్, చీఫ్ మేనేజర్ పోస్టుల భర్తీకి విడుదల చేసింది. ఈ పోస్టులకు డిగ్రీ పాసైన వాళ్లు అర్హులు. బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్, బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ, ఎంఎస్‌సీ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎంఎస్‌సీ ఇన్ కంప్యూటర్ సైన్స్, బీసీఏ, ఎంసీఏ లాంటి కోర్సులు చదివిన వారికి ప్రాధాన్యం ఉంటుంది. అనుభవం: మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏఎంఎల్, రిస్క్, అప్లికేషన్ సపోర్ట్ ఫర్ సీబీఎస్, సీఐఎస్, టెస్టింగ్ అండ్ రిలీజ్ లాంటి విభాగాల్లో కనీసం మూడేళ్ళ నుంచి ఐదేళ్ల అనుభవం ఉండాలి.
పలు విభాగాల్లో మొత్తం ఖాళీలు 41 ఉన్నాయి . వీటిలో జూనియర్ అసోసియేట్ (IT) 15 , అసిస్టెంట్ మేనేజర్ (IT) 10 , మేనేజర్ (IT) 9 , సీనియర్ మేనేజర్ (IT) 5, చీఫ్ మేనేజర్ (IT) 2 ఈ పోస్టులకు వయస్సు 55 ఏళ్ల లోపు ఉండాలి. ఈ దరఖాస్తులకు చివరితేది ఫిబ్రవరి 28. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక విధానం ఉంటుంది .. పరిస్థితులను బట్టి గ్రూప్ డిస్కషన్ లేదా ఆన్‌లైన్ టెస్ట్ కూడా నిర్వహించవచ్చు. పూర్తి వివరాలకు వెబ్‌సైట్ ను సంప్రదించవచ్చు :https://www.ippbonline.com/