ఐడిబిఐ బ్యాంక్(IDBI Bank) ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతుంది. ఐడిబిఐ బ్యాంక్ లిమిటెడ్ స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్(Cadre Officer) పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్‌ను చేపట్టింది. మేనేజర్ గ్రేడ్ బి(Manager Grade B), అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గ్రేడ్ సి(Assistant Manager Grade C), డిప్యూటీ జనరల్ మేనేజర్ గ్రేడ్ డి(Deputy General Manager Grade C) పోస్టులపై రిక్రూట్‌మెంట్ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది.
ఐడిబిఐ బ్యాంక్(IDBI Bank) ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతుంది. ఐడిబిఐ బ్యాంక్ లిమిటెడ్ స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్(Cadre Officer) పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్‌ను చేపట్టింది. మేనేజర్ గ్రేడ్ బి(Manager Grade B), అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గ్రేడ్ సి(Assistant Manager Grade C), డిప్యూటీ జనరల్ మేనేజర్ గ్రేడ్ డి(Deputy General Manager Grade C) పోస్టులపై రిక్రూట్‌మెంట్ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. ఐడీబీఐ బ్యాంక్‌లో స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టుకు మొత్తం 136 ఖాళీలు ఉన్నాయి. ఈ రిక్రూట్‌మెంట్ కు సంబంధించిన పూర్తి వివరాలు, దరఖాస్తు చేయడానికి IDBI బ్యాంక్ వెబ్‌సైట్ www.idbibank.in తెలుసుకోవాల్సిందే. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 15 జూన్ 2023. ఈ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. IDBI బ్యాంక్‌లో స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టుకు రిక్రూట్ అవ్వడానికి, సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్ డిగ్రీ/ పీజీ డిగ్రీ/ పీహెచ్‌డీ డిగ్రీ కలిగి ఉండాలి.
IDBI బ్యాంక్ రిక్రూట్‌మెంట్ 2023: ఖాళీల వివరాలు
మేనేజర్-గ్రేడ్ B: 84
అసిస్టెంట్ జనరల్ మేనేజర్-గ్రేడ్ C: 46
డిప్యూటీ జనరల్ మేనేజర్-గ్రేడ్ D: 6
వయో పరిమితి
ఐడిబిఐ బ్యాంక్‌లో స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ విభాగంలో మేనేజర్ పోస్టుకు అభ్యర్థి వయసు 25 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. అసిస్టెంట్ జనరల్ మేనేజర్‌కు 28 నుండి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. అలాగే డిప్యూటీ జనరల్ మేనేజర్‌కు వయసు 35 నుండి 45 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో మూడు నుంచి ఐదేళ్ల వరకు సడలింపు ఉంటుంది.
జీతం వివరాలు..
మేనేజర్- గ్రేడ్ B : రూ.48170-1740(1)-49910-1990(10)-69810 (12 సంవత్సరాలు)
అసిస్టెంట్ జనరల్ మేనేజర్-గ్రేడ్ సి : రూ.63840-1990(5)-73790-2220(2)-78230 (8 సంవత్సరాలు)
డిప్యూటీ జనరల్ మేనేజర్-గ్రేడ్ D : 76010-2220(4)-84890-2500(2)-89890 (7 సంవత్సరాలు)
మరిన్ని వివరాల కోసం www.idbibank.in సందర్శించండి.