నిరుద్యోగులకు హైదరాబాద్ మెట్రో రైల్(Hyderabad Metro Rail) సంస్థ శుభవార్త చెప్పింది. హైదరాబాద్ మెట్రో(Hyderabad Metro)లో ఖాళీగా ఉన్నటువంటి 9 రకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా మొత్తం 46 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాల భర్తీకి రాత పరీక్ష నిర్వహిస్తారు. మెరిట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉండనుంది.

మెట్రో ఉద్యోగాల వివరాలు:

మొత్తం ఖాళీలు: 46

విభాగాలు:

సిగ్నలింగ్ టీమ్ లీడర్ – 3
రోలింగ్ స్టాక్ టీమ్ లీడర్ – 1
రోలింగ్ స్టాక్ ఇంజనీర్ – 1
AFC/COM మెయింటెయినర్ – 5
రైలు ఆపరేటర్ – 30
AFC/COM సిస్టమ్ అనలిస్ట్ – 1
PSS ఇంజనీర్ – 1
PSS టీమ్ లీడర్ – 2
MEP టీమ్ లీడర్ – 2

విద్యార్థతలు: డిప్లొమా, ఐటిఐ, బీఈ, బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ పూర్తి చేసిన వారు అర్హులు. అలాగే సంబంధిత పనిలో అనుభవం కలిగి ఉండాలి. అయితే ఈ ఉద్యోగాలకు ప్రయత్నించే అభ్యర్థుల వయస్సు 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వడ్ కేటగిరీ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.

జాబ్ అప్లై చేసే విధానం :- అర్హత, ఆసక్తి గల అభర్ధులు ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ముందుగా https://www.ltmetro.com/ లోకి వెళ్లాలి. Current Oppurtunities అనే ఆప్షన్ పై క్లిక్ చేసి వివరాలు చూసుకోవచ్చు. అప్లికేషన్ ఫామ్ పూర్తి చేసిన తర్వాత… [email protected] పంపాలి.

ఎంపిక విధానం: మొదట దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులను షార్ట్ లిస్ట్ చేస్తారు. అందులో క్వాలిఫై అయిన వారికి స్కిల్ టెస్ట్ పెట్టి.. ఆ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు

Updated On 7 May 2023 12:50 AM GMT
Ehatv

Ehatv

Next Story