గూగుల్(Google) కంపెనీలో మరిన్ని ఉద్యోగాల తొలగింపు తప్పదని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్(CEO Sundar Pichai) ధృవీకరించారు. 2024లో ప్రాధాన్యతలు, నిర్ణయాలపై ఉద్యోగులకు సుందర్ పిచాయ్ మెమో(Memo) ఇచ్చారు. ఈ ఏడాది కంపెనీ ప్రాధాన్యత గల ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెడుతోందని వివరించారు. వీటి కోసం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని సుందర్ పిచాయ్ తెలిపారు.
గూగుల్(Google) కంపెనీలో మరిన్ని ఉద్యోగాల తొలగింపు తప్పదని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్(CEO Sundar Pichai) ధృవీకరించారు. 2024లో ప్రాధాన్యతలు, నిర్ణయాలపై ఉద్యోగులకు సుందర్ పిచాయ్ మెమో(Memo) ఇచ్చారు. ఈ ఏడాది కంపెనీ ప్రాధాన్యత గల ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెడుతోందని వివరించారు. వీటి కోసం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని సుందర్ పిచాయ్ తెలిపారు. ఉద్యోగుల తొలగింపు అన్ని టీంలపై పడనప్పటికీ తొలగింపు అయితే కొనసాగుతుందన్నారు.
అయితే, పిచాయ్ ఎన్ని ఉద్యోగాలు తొలగిస్తారో ధృవీకరించలేదు. గత సంవత్సరం కంటే ఎక్కువ ఉండదని అతను స్పష్టం చేశాడు. 2023లో, Google ఒకేసారి 12,000 ఉద్యోగాలను తొలగించింది. గత సంవత్సరం తొలగింపుల స్థాయిలో మాత్రం ఉండవని ఉద్యోగులకు ఇచ్చిన మెమోలో సుందర్ పేర్కొన్నారు. కంపెనీల్లో మార్పులు, చేర్పులుంటాయని ఇదివరకే తెలిపినట్లు ఆయన అన్నారు. కొన్ని టీంలు ఏడాది పొడవునా రిక్రూట్‌మెంట్ చేసుకుంటాయని.. కొన్ని టీంలపై లే ఆఫ్స్ ప్రభావం ఉంటుందని తెలిపారు. ఈనెల ప్రారంభంలో ఆర్/వీఆర్ విభాగంలో పలువురు ఉద్యోగులను ఇప్పటికే తొలగించింది. ఎన్ని ఉద్యోగాలు, ఎప్పుడు తొలగిస్తారన్న స్పష్టత లేపప్పటికీ ఏడాది పొడవునా ఉద్యోగాలు తొలగిస్తారని సుందర్ పిచాయ్ మెమోతో అర్థమవుతుందని బిజినెస్ వర్గాలు చెప్తున్నాయి.