ఉరుకుల పరుగుల జీవితం ... ఉద్యోగాలతోనే రోజు గడిచి పోతుంది .. కనీసం ఫ్యామిలీ మెంబెర్స్ తో కాస్త గడిపే సమయం కూడా కరువైంది . వారం అంత కష్టపడితే గాని ఒక్క రోజు వీక్ ఆఫ్ దొరుకుతుంది . ఆ రోజు కూడా ఇంట్లో వర్క్స్ తోనే కాస్త గడిచి పోతుంది .. అయితే వారానికి ఒక్క వీక్ ఆఫ్ కి బదులు మూడు వీక్ ఆఫ్ లు అని చెపితే ఒక్కసారిగా ఏగిరి గంతేస్తారు […]

ఉరుకుల పరుగుల జీవితం ... ఉద్యోగాలతోనే రోజు గడిచి పోతుంది .. కనీసం ఫ్యామిలీ మెంబెర్స్ తో కాస్త గడిపే సమయం కూడా కరువైంది . వారం అంత కష్టపడితే గాని ఒక్క రోజు వీక్ ఆఫ్ దొరుకుతుంది . ఆ రోజు కూడా ఇంట్లో వర్క్స్ తోనే కాస్త గడిచి పోతుంది .. అయితే వారానికి ఒక్క వీక్ ఆఫ్ కి బదులు మూడు వీక్ ఆఫ్ లు అని చెపితే ఒక్కసారిగా ఏగిరి గంతేస్తారు కదా ... అవును మీరు విన్నది నిజమే ... కానీ ఇది ఎక్కడ అని ఆలోచిస్తున్నరా ? వివరాలు ఏంటో ఒక్కసారి తెలుసుకుందాం...

ప్రస్తుత పరిస్థితుల్లో చాలా మంది ఉద్యోగాల వల్ల తమ పర్సనల్ లైఫ్ ని మిస్ అవుతున్నారు . చాలా కంపనీలకు ఒక్కరోజు మాత్రమే వీక్ ఆఫ్ ఉంటుంది . అదే సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ఐదు రోజులు కష్టపడి చేస్తే.. వారంతంలో వచ్చే రెండు వీక్‌ హాఫ్ లు ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నాయి . ఈ క్రమం లోనే బ్రిటన్‌లో పలు కంపెనీలు ఉద్యోగులకు... వారానికి నాలుగు రోజులే పని అంటూ గుడ్ న్యూస్ చెప్పాయి .

వారానికి నాలుగు రోజులు మాత్రమే పని చేసి.. మిగిలిన మూడు రోజుల్లో విశ్రాంతి తీసుకునేలా... బ్రిటన్‌లో 61 కంపెనీలు 'పైలట్ స్కీమ్'ను ఇప్పటికే ప్రారంభించాయి. ఈ పైలట్ ప్రాజెక్ట్‌లో పాల్గొన్న 61 కంపెనీలలో చాలావరకు ఈ వర్కింగ్ మోడల్‌కు అనుకూలంగా తమ అభిప్రాయాన్ని అందించాయి.

గతేడాది బ్రిటన్‌లో 4 రోజుల వర్కింగ్ మోడల్‌ను అమలు చేయడానికి నాన్-ఫైనాన్షియల్ సంస్థ 'ఫోర్ డే వీక్ గ్లోబల్' పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. దీనికింద దేశంలోని మొత్తం 61 కంపెనీలకు చెందిన 3 వేల మంది ఉద్యోగులు ఒకే జీతంతో 4 రోజులు పని చేసేందుకు అవకాశం కల్పించారు. . దాదాపు 91 శాతం కంపెనీలు ఈ పైలట్ ప్రాజెక్ట్‌కు అనుకూలంగా స్పందించాయి.

ఈ పైలట్ స్కీమ్ పై పరిశోధన చేస్తున్న ప్రిన్సిపల్ ప్రొఫెసర్ జూలియట్ స్కోర్ ...ఈ మోడల్ వివిధ ఆఫీస్ ల్లో అమలు చేశామని.. ప్రతిచోటా దాదాపు సక్సెస్ అయిందన్నారు . వారానికి నాలుగు రోజులు పని చేయడం వల్ల ఉద్యోగులకు ఎక్కువ రెస్ట్ దొరికినట్లు నివేదిక వచ్చి౦ది అన్నారు . . ఈ విధానం వల్ల పదేపదే కంపెనీలు మారే వారి సంఖ్య కూడా భారీగా తగ్గిందన్నారు. ఫోర్ డేస్ వర్కింగ్ మోడల్ విజయవంతం కావడంతో.. దాదాపు 91 శాతం కంపెనీలు ఈ విధానాన్ని కంటిన్యూ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు జూలియట్ వెల్లడించారు.

Updated On 24 Feb 2023 7:41 AM GMT
Ehatv

Ehatv

Next Story