ఈ రోజుల్లో, ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్(smart phone) ఉంది రోజంతా దానిపై మాత్రమే సమయాన్ని గడిపేస్తున్నాం . తెలియకుండానే చాలా సమయం గడిచిపోతుంది. మీరు కూడా మొబైల్‌లో రీల్స్ మాత్రమే చూస్తూ గంటలు సమయాన్ని వృధాగా గడిపితే, కనుక ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది . ఈరోజు మనం మొబైల్ ఫోన్ ద్వారా ఇంట్లో కూర్చొని డబ్బు సంపాదించే కొన్ని మార్గాల గురించి తెలుసుకుందాం
ఈ రోజుల్లో, ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్(smart phone) ఉంటుంది .రోజంతా దానిపై మాత్రమే సమయాన్ని గడిపేస్తున్నాం . తెలియకుండానే చాలా సమయం గడిచిపోతుంది. మీరు కూడా మొబైల్‌లో రీల్స్ మాత్రమే చూస్తూ గంటలు సమయాన్ని వృధాగా గడిపితే, కనుక ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది . ఈరోజు మనం మొబైల్ ఫోన్ ద్వారా ఇంట్లో కూర్చొని డబ్బు సంపాదించే కొన్నిమార్గాల గురించి తెలుసుకుందాం .
ప్రస్తుతం, మొబైల్ ఫోన్‌లలో నుండి డబ్బు సంపాదించుకొనే ఇలాంటి అనేక ఫీచర్లు వచ్చాయని మనకు తెలుసు . కానీ వీటిలో 90% ఫేక్ అయితే మరి కొన్ని డబ్బులు కట్టించుకొని ఉపయోగపడేవి అయిఉంటాయి . మీరు ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్ లేకుండా కూడా ఆన్‌లైన్‌లో చాలా రకాల మార్గాల్లో డబ్బుని సంపాదించవచ్చు . మీరు మొబైల్ ఫోన్ నుండి ఆన్‌లైన్‌లో ఏదైనా చేయడం ద్వారా డబ్బు సంపాదించాలనుకుంటే, మీరు ఇది చేయగలరో లేదో చూసుకోండి .
ఆన్‌లైన్ కంటెంట్ రైటింగ్(Online Content Writing)
ప్రస్తుతం చాలా కంపెనీలు మరియు వెబ్‌సైట్‌లు ఫ్రీలాన్సర్‌లకు కంటెంట్ రైటింగ్ (Content Writing)కోసం చాలా డబ్బు చెల్లిస్తున్నాయి. మీరు ఏదైనా సబ్జెక్ట్‌పై కాంటెంట్ రాయగలము లేదా రాయాలనుకుంటే, ఇంట్లో కూర్చొని డబ్బు సంపాదించవచ్చు. ఇందులో, మీరు వ్రాయవలసిన గడువుతో కూడిన టాపిక్ ఇవ్వబడుతుంది . ఆన్‌లైన్ కంటెంట్ రైటింగ్ కోసం, మీరు ఏదైనా ఒక భాష గురించి మంచి పరిజ్ఞానం కలిగి ఉండాలి, మీరు లోపాలు లేకుండా కంటెంట్‌ను సిద్ధం చేసి ఇవ్వగలిగితే . ఇందులో పద పరిమితి ప్రకారం మీకు డబ్బు ఇవ్వబడుతుంది.ప్రస్తుతం చాల వెబ్ సైట్స్ (Web Sites)లో వీటిమీద సమాచారం దొరుకుతుంది .
మీ సొంత బ్లాగును మొదలుపెట్టండి(Own Blogging)
మీరు వేరొకరి కోసం పని చేయటం ,వాళ్ళు ఇచ్చిన అంశంపై వ్రాయడానికి ఇష్టపడకపోతే, మీరు మీ సొంత బ్లాగును కూడా మొదలుపెట్టచ్చు . దీని కోసం, blogger.com వంటి అనేక వెబ్‌సైట్‌లు మీకు ఉచితంగా సౌకర్యాన్ని అందిస్తాయి. దీనిపై మీకు పేజీ వ్యూస్ ప్రకారం డబ్బు ఇవ్వబడుతుంది. మీ సొంత బ్లాగును ప్రారంభించినప్పుడు, మొదట్లో మీరు మీపేజీలో వ్యూస్ పొందడానికి కొంత కష్టపడవలసి ఉంటుంది. దీని తర్వాత, మీరు Google Adsenseతో మీ పేజీలో ప్రకటనల ద్వారా డబ్బు సంపాదించడం మొదలుపెడతారు .