గ్రూప్-1. గ్రూప్-2 పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ జారీకి సీఎం వైయస్ జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ముఖ్యమంత్రికి అధికారులు ఈ పోస్టుల భర్తీపై వివరాలు అందించారు. సీఎం ఆదేశాల మేరకు ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ చురుగ్గా సాగుతోందని వెల్లడించారు. ప్రభుత్వంలోని వివిధ శాఖల నుంచి ఖాళీల వివరాలు తెప్పించుకున్నామని వెల్లడించారు.
గ్రూప్-1. గ్రూప్-2 పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్(Notification) జారీకి సీఎం వైయస్ జగన్(CM Jagan) గ్రీన్ సిగ్నల్(Green Signal) ఇచ్చారు. ముఖ్యమంత్రికి అధికారులు ఈ పోస్టుల భర్తీపై వివరాలు అందించారు. సీఎం ఆదేశాల మేరకు ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ చురుగ్గా సాగుతోందని వెల్లడించారు. ప్రభుత్వంలోని వివిధ శాఖల నుంచి ఖాళీల వివరాలు తెప్పించుకున్నామని వెల్లడించారు. నోటిఫికేషన్ జారీకి అవసరమైన కసరత్తు తుదిదశలో ఉందని తెలిపారు. గ్రూప్-1(Group-1)కి సంబంధించి సుమారు 100కిపైగా పోస్టులు, గ్రూప్-2(Group-2)కు సంబంధించి సుమారు 900కిపైగా పోస్టులు, మొత్తంగా 1000కిపైగా పోస్టులు భర్తీచేయనున్నామని తెలిపారు. వీలైనంత త్వరలో దీనికి సంబంధించి నోటిఫికేషన్ జారీచేయాలని సీఎం ఆదేశించారు. పరీక్షల నిర్వహణ, ఫలితాలు వెల్లడి తదితర అంశాలపైనా దృష్టిసారించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.