కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల(Central Government Jobs) కోసం ఎదురుచూస్తున్నారా ?.. అయితే మీకోసం రైల్వేలో(Railway) అనేక పోస్టులు ఉన్నాయి. నిరుద్యోగులకు ఎప్పుడూ శుభవార్త అందించే రైల్వే శాఖ.. ఇప్పుడు మరోసారి గుడ్ న్యూస్ చెప్పింది. రైల్వే ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ(Railway Integral Coach Factory), చెన్నై వివిధ ట్రేడ్‌ల కోసం అప్రెంటీస్ పోస్టుల(Aparenties post) భర్తీ చేసేందుకు సన్నాహాలు చేస్తుంది.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల(Central Government Jobs) కోసం ఎదురుచూస్తున్నారా ?.. అయితే మీకోసం రైల్వేలో(Railway) అనేక పోస్టులు ఉన్నాయి. నిరుద్యోగులకు ఎప్పుడూ శుభవార్త అందించే రైల్వే శాఖ.. ఇప్పుడు మరోసారి గుడ్ న్యూస్ చెప్పింది. రైల్వే ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ(Railway Integral Coach Factory), చెన్నై వివిధ ట్రేడ్‌ల కోసం అప్రెంటీస్ పోస్టుల(Apprentice post) భర్తీ చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. ఇందుకోసం తాజాగా ఓ భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ అప్రెంటీస్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అర్హతలు ఉన్న అభ్యర్థులు నోటిఫికేషన్ లో ఉన్న చివరి తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. ఈ రిక్రూట్‌మెంట్ కోసం ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలు తెలుసుకోవడానికి మీరు అధికారిక వెబ్‌సైట్‌కి pb.icf.gov.in. లాగిన్ కావాల్సి ఉంటుంది.

ఖాళీ వివరాలు
ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 782 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేస్తారు. వీటిలో 252 పోస్టులు ఫ్రెషర్‌, 530 ఎక్స్‌-ఐటీఐ పోస్టులు ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ అయ్యే పోస్టులు.. వెల్డర్, ఫిట్టర్, కార్పెంటర్, మెకానిస్ట్, పెయింటర్, ఎలక్ట్రీషియన్. వీటి కోసం దరఖాస్తులు అందించడానికి జూన్ 30, 2023 చివరితేదీ.

అర్హతలు..
ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అందులోనే కనీసం 50 శాతం మార్కులు వచ్చి ఉండాలి. దీనితో పాటు అభ్యర్థి NCVT/SCVT జారీ చేసిన నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ కూడా కలిగి ఉండడం తప్పనిసరి.

అలాగే అభ్యర్థుల వయసు 15 నుంచి 24 సంవత్సరాలు ఉండాలి. రిజర్వ్‌డ్ కేటగిరీ నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 782 పోస్టులను భర్తీ చేయనున్నారు. అలాగే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థులు రూ.100 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. మహిళలు, SC, ST, PWD కేటగిరీ అభ్యర్థులకు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. 10వ మెరిట్ జాబితా ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 10వ తరగతి ఉత్తీర్ణులకు నెలకు రూ.6000, 12వ తరగతి ఉత్తీర్ణత సాధించిన వారికి రూ.7,000, జాతీయ లేదా రాష్ట్ర సర్టిఫికెట్ హోల్డర్లకు కూడా రూ.7000 జీతం ఉంటుంది.

Updated On 14 Jun 2023 11:43 PM GMT
Ehatv

Ehatv

Next Story