భారత కేంద్రహోం మంత్రిత్వశాఖలో భాగంగా ఉన్న బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 1284 పోస్టులను భర్తీ చేయనుంది. మొత్తం ఖాళీలు 1284 ఉన్నాయి . కానిస్టేబుల్(ట్రేడ్స్‌మెన్) పోస్టులు విభాగం లో పురుషులు 1220 పోస్టులు ఉండగా ...మహిళలకు 64 పోస్టులు ఉన్నాయి . కోబ్లర్, టైలర్, వాషర్‌మన్, బార్బర్, స్వీపర్, కుక్, వెయిటర్ పలు విభాగాల్లో ఈ ఖాళీలున్నాయి. మెట్రిక్యులేషన్/ 10వ తరగతి/ తత్సమాన ఉత్తీర్ణత ఉండాలి. […]
భారత కేంద్రహోం మంత్రిత్వశాఖలో భాగంగా ఉన్న బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 1284 పోస్టులను భర్తీ చేయనుంది.
మొత్తం ఖాళీలు 1284 ఉన్నాయి . కానిస్టేబుల్(ట్రేడ్స్‌మెన్) పోస్టులు విభాగం లో పురుషులు 1220 పోస్టులు ఉండగా ...మహిళలకు 64 పోస్టులు ఉన్నాయి .
కోబ్లర్, టైలర్, వాషర్‌మన్, బార్బర్, స్వీపర్, కుక్, వెయిటర్ పలు విభాగాల్లో ఈ ఖాళీలున్నాయి. మెట్రిక్యులేషన్/ 10వ తరగతి/ తత్సమాన ఉత్తీర్ణత ఉండాలి. కొన్ని ట్రేడుల్లో ఎన్‌ఎస్‌క్యూఎఫ్ లెవల్ 1 కోర్సు పూర్తి చేయాలి.
ఈ పోస్టుల కు 18 నుంచి 25 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయసులో సడలింపు ఉంటుంది.
జీతభత్యాలు నెలకు రూ.21700-రూ.69100 చెల్లిస్తారు.
అయితే ఎంపిక విధానం లో రాత పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. రాతపరీక్షలో భాగంగా 100 ప్రశ్నలకు 100 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 2 గంటలు. పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ నిర్వహిస్తారు. అభ్యర్థులకు ట్రేడ్ టెస్ట్ నిర్వహిస్తారు. అందులో అర్హత సాధించాలి. కానీ దీనికి ఎలాంటి మార్కులు ఉండవు. దరఖాస్తు ఫీజు: రూ.100. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుకు చివరి తేది: మార్చి 27, 2023. పోస్టుల పూర్తి వివరాలకు వెబ్‌సైట్:https://rectt.bsf.gov.in/