బ్యాంక్ ఉద్యోగం(Bank Job).. చాలా మంది కల. ప్రభుత్వ, ప్రైవేట్ ఏదైనా సరే బాంక్యు ఉద్యోగం సాధించాలని అనుకుంటారు. అందుకు ప్రతి ఏడాది నిర్వహించే ఆర్బీఐ పరీక్షలకు సిద్దమవుతుంటారు. SBI, RBI కాకుండా దేశంలోని చాలా బ్యాంకుల్లో ఉద్యోగాలు IBPS నిర్వహించే పరీక్షల ద్వారా భర్తీ చేస్తుంటారు. ఈ రెండు బ్యాంకులు SBI, RBIలో రిక్రూట్‌మెంట్ కోసం ఆ సంస్థలు స్వతహాగా నోటిఫికేషన్ విడుదల చేసి.. పోస్టులను భర్తీ చేస్తుంటారు.

బ్యాంక్ ఉద్యోగం(Bank Job).. చాలా మంది కల. ప్రభుత్వ, ప్రైవేట్ ఏదైనా సరే బాంక్యు ఉద్యోగం సాధించాలని అనుకుంటారు. అందుకు ప్రతి ఏడాది నిర్వహించే ఆర్బీఐ పరీక్షలకు సిద్దమవుతుంటారు. SBI, RBI కాకుండా దేశంలోని చాలా బ్యాంకుల్లో ఉద్యోగాలు IBPS నిర్వహించే పరీక్షల ద్వారా భర్తీ చేస్తుంటారు. ఈ రెండు బ్యాంకులు SBI, RBIలో రిక్రూట్‌మెంట్ కోసం ఆ సంస్థలు స్వతహాగా నోటిఫికేషన్ విడుదల చేసి.. పోస్టులను భర్తీ చేస్తుంటారు. ఉత్తీర్ణత ద్వారా ఉద్యోగాలు పొందే IBPS, SBI, RBI , ఇతర పరీక్షల గురించి తెలుసుకోవాలి. SBI బ్యాంక్ పరీక్షలు అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వివిధ పోస్టులకు రిక్రూట్‌మెంట్ కోసం వివిధ పరీక్షలు అందుబాటులో ఉంటాయి. అందులో SBI PO పరీక్ష, SBI SO ఎగ్జామ్, SBI క్లర్క్ ఎగ్జామ్ ఉన్నాయి.

SBI PO ఎగ్జామ్: SBI ప్రొబేషనరీ ఆఫీసర్స్ (PO) పరీక్ష అని కూడా పిలుస్తారు. ఇది SBI బ్యాంక్ మేనేజ్‌మెంట్ కేడర్‌కు అభ్యర్థులను ఎంపిక చేసేందుకు నిర్వహిస్తారు. SBI PO పరీక్షలో మూడు దశలు ఉంటాయి.

SBI SO ఎగ్జామ్: SBI SO పరీక్షను.. బ్యాంకులోని స్పెషలిస్ట్ ఆఫీసర్ (SO) పోస్టులను ఎంపిక చేయడం కోసం నిర్వహిస్తారు. ఈ పోస్టులకు ఎంపిక ప్రక్రియలో అభ్యర్థుల అనుభవం, నైపుణ్యం ఆధారంగా ఇంటర్వ్యూ ఉంటుంది.

SBI క్లర్క్ పరీక్ష: SBI క్లర్క్ ఎగ్జామ్ ద్వారా బ్యాంకింగ్ దిగ్గజం క్లరికల్ కేడర్ కోసం జూనియర్ అసోసియేట్‌లను నియమిస్తారు. ఈ పరీక్షలో రెండు దశలు ఉంటాయి.

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ అనేది ఒక పరీక్షా సంస్థ. ఇది పెద్ద సంఖ్యలో బ్యాంకు ఉద్యోగాలను భర్తీ చేస్తుంది. ఇందుకోసం IBPS అనేక ఆన్‌లైన్ బ్యాంక్ పరీక్షలను నిర్వహిస్తుంది. IBPS నిర్వహించిన పరీక్షల గురించిన సమాచారం ముందు తెలుసుకుందాం.

1. IBPS PO ఎగ్జామ్.. IBPS PO పరీక్ష మూడు దశలను కలిగి ఉంటుంది. ఇది కాకుండా, IBPS SO పరీక్ష, IBPS క్లర్క్ ఎగ్జామ్ కూడా ఉంటుంది.
2. IBPS RRB పరీక్ష: IBPS RRB CRP పరీక్ష అనేది ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల కోసం నిర్వహిస్తుంది. దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో సేవలందిస్తున్న చిన్న బ్యాంకులలో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు దీనిని నిర్వహిస్తారు. వీటిలో సహకార, ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉన్నాయి.

RBI పరీక్షలు: RBI దేశంలోని కేంద్ర బ్యాంకు. బ్యాంకింగ్ రంగంలో చేరాలనుకునే అభ్యర్థులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ లేదా క్లరికల్ క్యాడర్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం ద్వారా ఇక్కడ ప్రవేశించవచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంస్థలో వివిధ నియామకాల కోసం ఇది సొంతంగా పరీక్షను నిర్వహిస్తుంది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ నిర్వహించే ప్రధాన పరీక్షలు RBI ఆఫీసర్ గ్రేడ్ B పరీక్ష, RBI అసిస్టెంట్ ఎగ్జామ్, అలాగే RBI జూనియర్ ఇంజనీర్ పరీక్ష.

ఇతర బ్యాంకింగ్ పరీక్షలు కూడా ఉన్నాయి. దేశంలోని వివిధ బ్యాంకులలో పెద్ద ఎత్తున రిక్రూట్‌మెంట్ కోసం నిర్వహించబడే పరీక్షలు IPPB, NABARD. IPPB అంటే "ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ పరీక్ష". ఇక (NABARD) నాబార్డ్ అంటే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్. ఈ పరీక్ష ద్వారా అసిస్టెంట్ మేనేజర్లను ఎంపిక చేస్తారు.

Updated On 17 Jun 2023 2:11 AM GMT
Ehatv

Ehatv

Next Story