టాటా గ్రూప్‌లో ప్రతిష్ఠాత్మకంగా నిలిచిన టాటా స్టీల్ సంస్థ టాటా స్టీల్ అస్పైరింగ్ ఇంజినీర్స్ ప్రోగ్రామ్-2023 ద్వారా ఇంజినీర్ ట్రెయినీ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది . . బీఈ/ బీటెక్/ బీఎస్సీ ఇంజినీరింగ్ ఉత్తీర్ణత గల అభ్యర్థులు అప్లయ్ చేసుకోవచ్చు. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో మార్చి 3వ తేదీలోగా అప్లయ్ చేసుకోవాలి . ఇంజినీర్ ట్రెయినీ శిక్షణను పూర్తి చేసిన అభ్యర్థులకు ఫిక్స్‌డ్ టర్మ్ ప్రాతిపదికన అసిస్టెంట్ మేనేజర్ హోదాలో ఉద్యోగం […]
టాటా గ్రూప్‌లో ప్రతిష్ఠాత్మకంగా నిలిచిన టాటా స్టీల్ సంస్థ టాటా స్టీల్ అస్పైరింగ్ ఇంజినీర్స్ ప్రోగ్రామ్-2023 ద్వారా ఇంజినీర్ ట్రెయినీ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది . . బీఈ/ బీటెక్/ బీఎస్సీ ఇంజినీరింగ్ ఉత్తీర్ణత గల అభ్యర్థులు అప్లయ్ చేసుకోవచ్చు. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో మార్చి 3వ తేదీలోగా అప్లయ్ చేసుకోవాలి . ఇంజినీర్ ట్రెయినీ శిక్షణను పూర్తి చేసిన అభ్యర్థులకు ఫిక్స్‌డ్ టర్మ్ ప్రాతిపదికన అసిస్టెంట్ మేనేజర్ హోదాలో ఉద్యోగం కల్పిస్తారు. అర్హత: బీఈ/ బీటెక్/ బీఎస్సీ ఇంజినీరింగ్ ఉత్తీర్ణత ఉండాలి. వయసు: 01.02.2023 వరకు 30 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు 32 ఏళ్లు వరకు వయసులో సడలింపు ఉంది. జీతభత్యాలు: శిక్షణ సమయంలో స్టైపెండ్ నెలకు రూ.30,000 చెల్లిస్తారు. ఉద్యోగంలో చేరిన తర్వాత ఏటా రూ.6.24లక్షలు చెల్లిస్తారు.
ఎంపిక విధానం లో కాగ్నిటివ్, టెక్నికల్ టెస్ట్‌లో మెరిట్ సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. అందులో ప్రతిభ చూపిన వారిని తుది ఎంపిక చేస్తారు. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో మార్చి 3వ తేదీలోగా అప్లయ్ చేసుకోవాలి.