APRS (మైనారిటీ) గురుకుల పాఠశాలలో అడ్మిషన్ పొందటానికి నోటిఫికేషన్ .! CAT-2023 నోటిఫికేషన్ :గుంటూరులోని ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ ప్రకటన ప్రకారం ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 12 APRS మైనారిటీ గురుకుల పాఠశాలల్లో 2023-24 విద్యా సంవత్సరానికి 5వ 6వ , 7వ ఇంకా 8వ తరగతులకు సంబంధించిన నోటిఫికేషన్ ను విడుదల చేయటం జరిగింది .

APRS (మైనారిటీ) గురుకుల పాఠశాలలు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లో బాలబాలికలకు ఉచిత విద్య ను వసతిని అందిస్తాయి. ప్రతి ఏడాది విద్యార్థులకు AP రెసిడెన్షియల్ మైనారిటీ స్కూల్స్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహిస్తుంది . ఈ టెస్ట్ లో పొందిన ర్యాంక్ ఆధారంగా అడ్మిషన్ అనేది ఉంటుంది .
ఈ ఏడాది గురుకులం లో అడ్మిషన్ పొందటానికి కావాల్సిన అర్హతలు..
4, 5, 6, 7వ తరగతి విద్యార్థులు 2022-2023 విద్యా సంవత్సరంలో ఉత్తీర్ణులై ఉండాలి. విద్యార్థి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.లక్ష కు మించకూడదు. మైనార్టీ, పీహెచ్‌సీ, అనాథ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన విద్యార్థులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు.
సీట్ల వివరాలు
రాష్ట్రంలోని 12 గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి సీట్లు (బాలురు, బాలికలు): 920
రాష్ట్రంలోని 12 గురుకుల పాఠశాలల్లో 6వ, 7వ ,8వ తరగతిలో సీట్లు (బాలురు, బాలికలు): 1145
ఆసక్తి ఉన్న విద్యార్థులు జూన్ 30, 2023లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. SC మరియు ST కేటగిరీ విద్యార్థులకు ప్రవేశ పరీక్ష నిర్వహించబడుతుంది. మైనారిటీ విద్యార్థులకు ప్రవేశ పరీక్ష లేదు.