2,260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం రెండు వేర్వేరు జీవోలు జారీ చేసింది.

2,260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం రెండు వేర్వేరు జీవోలు జారీ చేసింది. ప్రత్యేక ఉపాధ్యాయుల నియామకానికి సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో 2,260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులను సృష్టిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో 1136 ఎస్జీటీలు, 1124 స్కూల్ అసిస్టెంట్ల పోస్టులు ఉన్నాయి. ఈ నిర్ణయం, ప్రత్యేక అవసరాలు ఉన్న విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడానికి దోహదపడనుంది. త్వరలో మరో కొత్త డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం. ఇదివరకు 16,347 టీచర్ పోస్టుల కోసం నోటిఫికేషన్ వస్తాయని సమాచారం. ఇందులో స్కూల్ అసిస్టెంట్స్ (7,725), సెకండరీ గ్రేడ్ టీచర్స్ (6,371), ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (1,781), పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (286), ప్రిన్సిపల్స్ (52), ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ (132) ఉన్నాయి. తాజా ఉత్తర్వుల ప్రకారం, 1136 ఎస్జీటీ (స్పెషల్ గ్రేడ్ టీచర్) పోస్టులు ప్రాథమిక స్థాయిలో భర్తీ చేయడానికి… 1124 మంది స్కూల్ అసిస్టెంట్ల పోస్టులను సెకండరీ స్థాయిలో నియమించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రత్యేక ఉపాధ్యాయులు ఆటిజం, మానసిక వైకల్యం వంటి ప్రత్యేక అవసరాలు ఉన్న విద్యార్థులకు విద్యను బోధించడానికి ప్రత్యేకంగా శిక్షణ ఇస్తారు.
