తెలంగాణలో(Telangana) పరీక్షల జాతర వచ్చేస్తోంది. మరో పది రోజుల్లో వరుసగా ఎగ్జామ్స్(Examinations) ప్రారంభం కాబోతున్నాయి. గత కొన్ని నెలల క్రితం టీఎస్పీఎస్సీ(TSPSC) మాత్రమే కాకుండా.. మిగతా సంస్థలు విడుదల చేసిన నోటిఫికేషన్లకు సంబంధించిన పరీక్షలను నిర్వహించనున్నారు. గ్రూప్స్(Groups), లెక్చరర్స్(Lecturers), ఉపాద్యాయులతో సహా.. అనేక రంగాల్లో పలు పోస్టులను భర్తీ చేయనున్నారు.

తెలంగాణలో(Telangana) పరీక్షల జాతర వచ్చేస్తోంది. మరో పది రోజుల్లో వరుసగా ఎగ్జామ్స్(Examinations) ప్రారంభం కాబోతున్నాయి. గత కొన్ని నెలల క్రితం టీఎస్పీఎస్సీ(TSPSC) మాత్రమే కాకుండా.. మిగతా సంస్థలు విడుదల చేసిన నోటిఫికేషన్లకు సంబంధించిన పరీక్షలను నిర్వహించనున్నారు. గ్రూప్స్(Groups), లెక్చరర్స్(Lecturers), ఉపాద్యాయులతో సహా.. అనేక రంగాల్లో పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. అలాగే జూన్ 26 తేదీన టీఎస్పీఎస్సీ (TSPSC)నుంచి ఏఎంవీఐ(AMVI) పరీక్ష నిర్వహించనున్నారు. మరో రెండు రోజుల్లో ఈ పరీక్షకు సంబంధించిన హాల్ టికేట్స్ విడుదల చేయనున్నారు. ఇక జూలై 1 నుంచి వరుసగా పరీక్షలు నిర్వహించనున్నారు. మరీ ఏ రోజున ఏఏ పరీక్షలు ఉన్నాయో తెలుసుకుందామా.

గ్రూప్ 4..
జూలై 1న గ్రూప్ 4 పరీక్ష నిర్వహించనున్నారు. ఇందులో మొత్తం 8100 పోస్టులు ఉండగా.. దాదాపు పది లక్షలకు పైగా అప్లికేషన్స్ వచ్చాయి. ఇందుకు సంబంధించిన హల్ టికేట్స్ జూన్ 25 తర్వాత రిలీజ్ చేయనున్నారు.

TPBO ఎగ్జామ్...
TPBO (టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్) పరీక్షను జూలై 8న ఉదయం, సాయంత్రం రెండు షిఫ్టులలో నిర్వహించనున్నారు. ఇది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్.

వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ ఎగ్జామ్..
వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షను జూలై 13న ఉదయం నిర్వహించనున్నారు. ఇది కంప్యూటర్ బేస్ట్ ఎగ్జామ్. జూలై 14న తేదీన రెండు షిప్ట్ లలో ఈ పరీక్షను నిర్వహించనున్నారు.

గ్రౌండ్ వాటర్ డిపార్ట్ మెంట్ పరీక్షలు..
జూలై నెలలో గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ కు సంబంధించిన పరీక్షలు నిర్వహించనున్నారు. టెక్నికల్, నాన్ టెక్నికల్ ఉద్యోగాలకు పరీక్షలు జూలై 18,19,21వ తేదీన నిర్వహించనున్నారు.

గురుకుల నియామక పరీక్షలు..
తెలంగాణలోని గురుకుల స్కూల్స్, కాలేజీల్లో ఖాళీ పోస్టులకు ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దాదాపు 9వేలకు పైగా ఉద్యోగాలకు ఈ నోటిఫికేషన్ కింద భర్తీ చేయనున్నారు. ఆగస్ట్ 1 నుంచి 22 వరకు ఈ పోస్టులకు పరీక్షలు నిర్వహించనున్నారు. మొత్తం మూడు షిఫ్టులలో కంప్యూటర్ బేస్ట్ విధానంలో ఎగ్జామ్ నిర్వహిస్తారు.

గ్రూప్ 2 ఎగ్జామ్..
గ్రూప్ 2 పరీక్షను రెండు రోజుల్లో రెండు షిప్ట్ ల్లలో నాలుగు పేపర్ల పరీక్షను నిర్వహించనున్నారు. దీనికి నాలుగు నెలల క్రితమే నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆగస్టు 29, 30వ తేదీల్లో ఈ పరీక్షను నిర్వహించనున్నారు.

పాలిటెక్నిక్ లెక్చరర్స్..
పాలిటెక్నిక్ కాలేజీలో లెక్చరర్స్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు సెప్టెంబర్ 04 నంచి సెప్టెంబర్ 08వ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తామని టీఎస్పీఎస్సీ ప్రకటించింది.

పీఈటీ..
ఇంటర్మీడియట్ కళాశాలలో ఫిజికల్ డైరెక్టర్స్ ఉద్యోగాల భర్తీని టీస్పీఎస్సీ చేపట్టింది. ఇందుకు సెప్టెంబర్ 11వ తేదీన నిర్వహించనున్నట్లు తెలిపారు.

జూనియర్ లెక్చరర్స్ పరీక్షలు..
జూనియర్ కాలేజీలో ఉపాధ్యాయుల నియామకాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పరీక్షలు సెప్టెంబర్ 12 నుంచి అక్టోబర్ 03వ తేదీ వరకు నిర్వహించనున్నారు.

గ్రూప్ 3 పరీక్షలు..
TSPSC మొదటి సారిగా గ్రూప్ 3 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో దాదాపు పదమూడు వందలకు పైగా పోస్టులను భర్తీ చేయనున్నారు. అయితే ఈ పరీక్ష తేదీని ఇప్పటి వరకు ఖరారు చేయాలేదు. అయితే అక్టోబర్ రెండో వారంలో ఈ పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది. అవకాశం ఉంది.

Updated On 20 Jun 2023 1:00 AM GMT
Ehatv

Ehatv

Next Story