కార్గో లాజిస్టిక్స్ అండ్ అలైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్ (AAICLAS) పలు ఖాళీల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. సెక్యూరిటీ స్క్రీనర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 400 ఖాళీలు ఉన్నాయి.దేశంలోని వివిధ ప్రాంతాల్లో వేర్వేరు చోట్ల ఈ పోస్టులు ఉన్నాయి.
ఏఏఐ కార్గో లాజిస్టిక్స్ అండ్ అలైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్ (AAICLAS) ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. ఇప్పటికే ఎయిర్‌పోర్టులో ఉద్యోగాలభర్తీకి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఏఏఐ కార్గో లాజిస్టిక్స్ అండ్ అలైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్ (AAICLAS) పలు ఖాళీల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. సెక్యూరిటీ స్క్రీనర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 400 ఖాళీలు ఉన్నాయి.దేశంలోని వివిధ ప్రాంతాల్లో వేర్వేరు చోట్ల ఈ పోస్టులు ఉన్నాయి. పోస్టింగ్ గురించి ఎక్కడ అన్నది కంపెనీ నిర్ణయిస్తుంది.
ఏఏఐ కార్గో లాజిస్టిక్స్ అండ్ అలైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్ (AAICLAS) ఉద్యోగాల భర్తీకి ఫ్రెషర్స్ నుంచి ఈ దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. ఇవి ఫిక్స్‌డ్ టర్మ్ కాంట్రాక్ట్ ఉద్యోగాలు . కాంట్రాక్ట్ గడువు మూడేళ్లు ఉంటుందని ... డిగ్రీ పాసైన వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు . అయితే అభ్యర్థులు ఆన్‌లైన్‌లోనే ఈ దరఖాస్తు చేసుకోవాలి .
ఈ పోస్టుల దరఖాస్తు మార్చి 8 2023 నుంచి ప్రారంభం అయ్యింది. దరఖాస్తుకు చివరి తేదీ- 2023 మార్చి 19. రాతపరీక్ష, ఇంటరాక్షన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక విధానం ఉంటుంది.
ఏదైనా డిగ్రీ కనీసం 60 శాతం మార్కులతో పాస్ కావాలి. ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులు 55 శాతం మార్కులతో పాస్ కావాలి. వయస్సు- 2023 మార్చి 19 నాటికి 27 ఏళ్ల లోపు. ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, ఎక్స్-సర్వీస్‌మెన్‌కు 5 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది. దరఖాస్తు ఫీజు- రూ.750. ఎస్‌సీ, ఎస్‌టీ, మహిళలకు ఫీజు లేదు. తనం- మొదట నెలకు రూ.15,000 స్టైపెండ్ లభిస్తుంది. ట్రైనింగ్, సర్టిఫికేషన్ ఎగ్జామినేషన్స్ పూర్తి చేసినవారికి మొదటి ఏడాది రూ.30,000, రెండో ఏడాది రూ.32,000, మూడో ఏడాది రూ.34,000. ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి.
AAICLAS Recruitment 2023 అప్లై చేసుకునే వారు ..... అభ్యర్థులు ముందుగా AAICLAS అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేసి కెరీర్స్ సెక్షన్ ఓపెన్ చేయాలి. ఆ తర్వాత సెక్యూరిటీ స్క్రీనర్ ఫ్రెషర్ నోటిఫికేషన్ క్లిక్ చేయాలి. అభ్యర్థులు తమ ఇమెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్, బేసిక్ వివరాలతో రిజిస్ట్రేషన్ చేయాలి. లాగిన్ చేసిన తర్వాత ఇతర వివరాలు ఎంటర్ చేయాలి. అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి. దరఖాస్తు ఫీజు చెల్లించి అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలి.