యంత్ర ఇండియా లిమిటెడ్‌ వివిధ పోస్టుల భర్తీకి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారి చేసింది . భారత రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని నాగ్‌పుర్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న యంత్ర ఇండియా లిమిటెడ్‌ ట్రేడ్ ఈ నోటిఫికేషన్‌ విడుదల చేసింది . వివిధ రాష్ట్రాల్లోని ఆర్డ్‌నెన్స్, ఆర్డ్‌నెన్స్ ఎక్విప్‌మెంట్ ఫ్యాక్టరీల్లో 57వ బ్యాచ్ ట్రేడ్ అప్రెంటిస్‌ శిక్షణకు సంబంధించి.. 5395 పోస్టుల భర్తీకి సంభ౦దించి.... ఫిబ్రవరి 27 నుంచి దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి . మొత్తం ఖాళీలు […]

యంత్ర ఇండియా లిమిటెడ్‌ వివిధ పోస్టుల భర్తీకి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారి చేసింది . భారత రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని నాగ్‌పుర్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న యంత్ర ఇండియా లిమిటెడ్‌ ట్రేడ్ ఈ నోటిఫికేషన్‌ విడుదల చేసింది . వివిధ రాష్ట్రాల్లోని ఆర్డ్‌నెన్స్, ఆర్డ్‌నెన్స్ ఎక్విప్‌మెంట్ ఫ్యాక్టరీల్లో 57వ బ్యాచ్ ట్రేడ్ అప్రెంటిస్‌ శిక్షణకు సంబంధించి.. 5395 పోస్టుల భర్తీకి సంభ౦దించి.... ఫిబ్రవరి 27 నుంచి దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి .

మొత్తం ఖాళీలు 5,395 ఉండగా ఇందులో ఐటీఐకు సంబంధించి- 3508 ఖాళీలు, నాన్ ఐటీఐకు సంబంధించి- 1887 ఖాళీలు ఉన్నాయి . మెషినిస్ట్, ఫిట్టర్, టర్నర్, వెల్డర్, పెయింటర్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, మేసన్, ఎలక్ట్రోప్లేటర్, మెకానిక్, ఫౌండ్రీమ్యాన్, బాయిలర్ అటెండెంట్, అటెండెంట్ ఆపరేటర్ కెమికల్ ప్లాంట్ తదితర ట్రేడుల్లో ఈ ఖాళీలున్నాయి.

వీటికి అర్హత గాను ఐటీఐ కేటగిరీకి సంబంధించి అభ్యర్థులు ...కనీసం 50% మార్కులతో పదో తరగతి లేదా తత్సమానం; నాన్-ఐటీఐ కేటగిరీకికి సంబంధించి అభ్యర్థులు 50% మార్కులతో పదో తరగతి, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. వయసు: 28.03.2023 నాటికి 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు దివ్యాంగులకు పదేళ్లు సడలింపు ఉంటుంది.

స్టైపెండ్ నెలకు నాన్-ఐటీఐలకు రూ.6000; ఐటీఐలకు రూ.7000 చెల్లిస్తారు. నాన్-ఐటీఐ కేటగిరీకి పదోతరగతి, ఐటీఐ కేటగిరీకి పదోతరగతి, ఐటీఐలో సాధించిన మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజు: రూ.200 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలు, ట్రాన్స్‌జెండర్ అభ్యర్థులకు రూ.100) గా నిర్ణయించారు. ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: మార్చి 28, 2023. పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌ : https://www.yantraindia.co.in/career.php

Updated On 24 Feb 2023 1:02 AM GMT
Ehatv

Ehatv

Next Story