Prakash Raj : పవన్‌ను రెచ్చిపోయి తిట్టేసిన ప్రకాశ్‌రాజ్...! మండిపడుతున్న జనసైనికులు
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ను(Pawan kalyan) ఎవరైనా ఏమైనా అంటే జనసైనికులు సహించరు. ఎదురుదాడికి దిగుతారు
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ను(Pawan kalyan) ఎవరైనా ఏమైనా అంటే జనసైనికులు సహించరు. ఎదురుదాడికి దిగుతారు. నిజమే ఎవరికైనా తమ అభిమాన నాయకుడిని అంటే కోపం తన్నుకుని రావడం సహజమే! ఇప్పుడు విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్‌ను(Prakash Raj) కూడా పవన్ అభిమానులు తిట్టిపోస్తున్నారు. అందుకు కారణం రోజుకో ట్వీట్‌తో పవన్‌లో తీవ్ర అసహనం కలిగిస్తున్నారు కాబట్టి. పవన్ కల్యాణ్ చర్యలను ప్రకాశ్‌రాజ్ సునిశితంగా విమర్శిస్తున్నారు. ఆ విమర్శ కూడా హుందాగా ఉంటోంది. తిరుమల(Tirumala) వేంకటేశ్వరస్వామి లడ్డూ(Laddu) తయారీకి వాడిని నెయ్యిలో కల్తీ జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు(Chandrababu) ఆరోపించడమే కాకుండా, జంతువుల కొవ్వు కలిసిందంటూ అర్థంపర్థం లేని ఆరోపణ చేయడంతో పవన్ కల్యాణ్‌లో ఆవేశం తన్నుకుని వచ్చింది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) చేసిన తప్పుకు తాను ప్రాయశ్చితం చేసుకుంటానంటూ ప్రతిన బూనారు. కాషాయం వేసుకుని దీక్ష చేపట్టారు. అప్పట్నుంచి పవన్ వెంట పడ్డారు ప్రకాశ్‌రాజ్. మొదట ప్రకాశ్‌రాజ్ చేసిన ట్వీట్‌పై పవన్ తీవ్రంగా మండిపడ్డారు. సనాతనధర్మాన్ని తూలనాడితే సహించేది లేదంటూ ఆవేశంగా అన్నారు పవన్. అప్పుడు గొడవకు అంకురం పడింది. పవన్ స్పీచ్ అంతా అయ్యాక ప్రకాశ్‌రాజ్ ఓ ట్వీట్ పెట్టారు. తన పోస్టును పవన్ సరిగ్గా అర్థం చేసుకోలేదని, తీరిగ్గా చదివి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలని ప్రకాశ్ సెటైర్లు వేశారు. చివరగా జస్ట్ ఆస్కింగ్ అంటూ పవన్‌కు అసహనం తెప్పించారు. అది మొదలు సోమవారం వరకు ప్రకాశ్‌రాజ్ రోజు కో ట్వీట్ చేస్తూ పవన్‌ను, ఆయన అభిమానులను ఉక్కిరిబిక్కరి చేస్తూ వస్తున్నారు. ఇక లేటెస్ట్‌గా ఓ తమిళ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అయితే పవన్ కల్యాణ్‌పై ప్రకాశ్‌రాజ్ తీవ్రంగా విమర్శించారు. పవన్ కల్యాణ్ తిరుపతిలో వారాహి డిక్లరేషన్ సభలో తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌పై(stalin) ఘాటైన విమర్శలు చేసిన సంగతి తెలిసిందే కదా! అందుకు ప్రకాశ్‌రాజ్ కౌంటర్ ఇస్తూ ఉదయనిధి స్టాలిన్‌కు సపోర్ట్ ఇచ్చారు. దాంతో పాటు పవన్‌పై కొన్ని ఘాటైన వ్యాఖ్యలు కూడా చేశారు. 'పవన్‌కల్యాణ్ ఫుట్‌బాల్ లాంటి వ్యక్తి. మైదానంలో ఫుట్‌బాల్‌ని తన్నినట్టుగా ఎవరైనా తంతారు. సిగ్గూ శరం లేని వ్యక్తి. ఒక అవకాశవాది. దేశంలో హిందూ ధర్మానికి, సనాతన ధర్మానికి ఎక్కడా ప్రమాదం పొంచి లేదు. బీజేపీ(BJP) మాత్రమే పొంచి వుందని చెబుతోంది. ఈ విషయాన్ని పవన్ తెలుసుకుంటే మంచిది' అంటూ ప్రకాశ్‌రాజ్ చెప్పారు. పవన్‌ను ఇంతలేసి మాటలనడటాన్ని జనసేన క్యాడర్ తట్టుకోలేకపోతున్నది. పోనీ ప్రకాశ్‌రాజ్‌కు కౌంటర్ ఇద్దామా అంటే ఏమని ఇవ్వాలో వారికి తెలియడం లేదు. ఒకవేళ ప్రకాశ్‌రాజ్‌ను ఏమైనా అంటే అంతకు వెయ్యి రెట్లు అనే కెపాసిటీ ప్రకాశ్‌రాజ్‌కు ఉంది. పవన్, ప్రకాశ్ వార్‌కు ఎప్పుడు ఎండ్‌కార్డ్ పడుతుందో చూడాలి.