అక్కడ అడుగుపెట్టామంటే మృత్యువుతో డేటింగ్‌ చేసినట్టే! చావును కొని తెచ్చుకున్నట్టే! అందుకే అక్కడికి ఎవరూ వెళ్లరు. ఎంత గొప్ప సాహసికుడికైనా ఆ ప్రదేశం పేరు చెబితే ముచ్చెమటలు పట్టేస్తాయి. అది ఈ భూమ్మీద అత్యంత విషపూరితమైన ప్రాంతం! అక్కడ భయంకరమైన నిశ్శబ్దం తాండవిస్తుంటుంది.

అక్కడ అడుగుపెట్టామంటే మృత్యువుతో డేటింగ్‌ చేసినట్టే! చావును కొని తెచ్చుకున్నట్టే! అందుకే అక్కడికి ఎవరూ వెళ్లరు. ఎంత గొప్ప సాహసికుడికైనా ఆ ప్రదేశం పేరు చెబితే ముచ్చెమటలు పట్టేస్తాయి. అది ఈ భూమ్మీద అత్యంత విషపూరితమైన ప్రాంతం! అక్కడ భయంకరమైన నిశ్శబ్దం తాండవిస్తుంటుంది. పిట్ట పురుగు కూడా కనిపించదక్కడ! ఒకప్పుడు జనవాసాలతో కళకళలాడిన ఆ ప్రాంతం ఇప్పుడు రుద్రభూమిగా మారింది. ఫ్రాన్స్‌లో(France) ఉన్న ఆ ప్రదేశం ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైనదిగా ఎలా మారింది? ఎవరు కారకులు?

ఆ విషపూరిత ప్రాంతం పేరు జోన్‌ రోగ్‌(Zone Rog). కొందరు దాన్ని డేంజర్‌ జోన్‌(Danger Zone) అని కూడా అంటారు. ఫ్రాన్స్‌లో ఉన్న ఈ ప్రాంతంలో గత వందేళ్లుగా ఎవరూ కాలు పెట్టలేదు. పెట్టే సాహసం కూడా ఎవరూ చేయరు. అసలు ఇక్కడికి ఎవరినీ వెళ్లనీయకుండా ప్రభుత్వమే నిషేధం విధించింది. పొరపాటున ఎవరైనా వెళతారేమోనని గట్టి కాపలా కూడా పెట్టింది. ఇక్కడి మట్టిలో, ఇక్కడి నీటిలో పూర్తిగా విషం నిండి ఉంది. అణువణువూ విషమే! ఇక్కడి పదార్థం మనిషి నోట్లోకి వెళితే మరణం ఖాయం. అందుకే ఈ ప్రాంతం నిర్జీవంగా ఉంటుంది. మొదటి ప్రపంచ(World War-1) యుద్ధానికి ముందు ఈ ప్రాంతంలో ప్రజలు నివసించేవారు. జనాలు సందడి చేసేవారు. ప్రపంచ యుద్ధంలో ఈ ప్రాంతమంతా ధ్వంసమయ్యింది. శత్రువులు ఈ ప్రదేశంపై లెక్కకు మించిన బాంబులు ప్రయోగించారు. రసాయనదాడులు(Chemical attacks) కూడా జరిగాయి. ఆ దాడుల ఫలితంగా ఇక్కడి గాలి కూడా విషపూరితంగా మారింది. ఇక్కడి మట్టిలోనే కాదు నీళ్లల్లో కూడా ఆర్సెనిక్‌(Arsenic) అధిక మోతాదులో ఉందని తేలింది. కొంతకాలం కిందట ఈ ప్రాంతాన్ని పరిశోధించడానికి వెళ్లిన ఇద్దరు జర్మన్‌ శాస్త్రవేత్తలు కనిపెట్టిన విషయమది! ఒక్క రేణువు చాలు ప్రాణాలు తీయడానికని పరిశోధనలో గుర్తించారు.

Updated On 24 Aug 2023 1:58 AM GMT
Ehatv

Ehatv

Next Story