జనాభా (Population)పెరిగిన కష్టమే.. తగ్గినా కష్టమే! ఒకప్పుడు విపరీతమైన పెరిగిన జనాభాతో చైనా(china) నానా తిప్పలు పడింది. జనాభా నియంత్రణ కోసం తీవ్రంగా శ్రమించింది. మొత్తం మీద కంట్రోల్‌లోకి తెచ్చింది. హమ్మయ్య అంటూ ఊపిరిపీల్చుకుంది.

జనాభా (Population)పెరిగిన కష్టమే.. తగ్గినా కష్టమే! ఒకప్పుడు విపరీతమైన పెరిగిన జనాభాతో చైనా(china) నానా తిప్పలు పడింది. జనాభా నియంత్రణ కోసం తీవ్రంగా శ్రమించింది. మొత్తం మీద కంట్రోల్‌లోకి తెచ్చింది. హమ్మయ్య అంటూ ఊపిరిపీల్చుకుంది. కానీ అనుకున్నదొక్కటి.. అయ్యింది మరోటి! ఇప్పుడా దేశంలో జననాల సంఖ్య రోజురోజుకీ తగ్గిపోతున్నది. వృద్ధుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. యువత(Youth) సంఖ్య మాత్రం తగ్గుతోంది. ఇందుకు కారణం యుక్త వయస్కులు పెళ్లికి దూరంగా ఉండటమేనని ప్రభుత్వం తెలుసుకుంది.

ఇలాగైతే లాభం లేదనుకుని యువతకు ప్రోత్సహాకాలు ప్రకటించింది. పాతికేళ్ల కంటే తక్కువ వయసులో పెళ్లి చేసుకున్న వారికి మన కరెన్సీ లెక్క ప్రకారం 11 వేల 340 రూపాయలను కానుకగా ఇవ్వనుంది. ఆ తర్వాత కూడా పిల్లల సంరక్షణ, విద్య విషయంలో సబ్సిడీలు ఇచ్చి జంటలకు ఆర్ధికంగా సహకారం అందించనుంది. జెజియాంగ్ రాష్ట్రంలోని(Zhejiang) చాంగ్షాన్‌ కౌంటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. సరైన వయసులో చేసుకునే మొదటి పెళ్లికి మాత్రమే ఈ కానుకను అందిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.

140 కోట్లకు పైగా జనాభా ఉన్న చైనాకు ప్రస్తుతం తగ్గిపోతున్న జననాల రేటు కలవరపెడుతున్నది. గత ఆరు దశాబ్దాలుగా జనాభా రేటు గణనీయంగా తగ్గిపోతోంది. ఈ క్రమంలోనే యువతులు తగిన వయసులో వివాహం చేసుకునేందుకు, పిల్లలను కనేలా ప్రోత్సహించే చర్యల్లో భాగంగా చాంగ్షాన్‌ నగదు ప్రోత్సాహకాన్ని తీసుకువచ్చింది. సాధారణ పెళ్లికి అబ్బాయికి కనీస వయసు 22 ఏళ్లుగా , అమ్మాయికి 20 ఏళ్లుగా ప్రభుత్వం నిర్ణయించింది.

కానీ పెళ్లి చేసుకునే వారి సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. ఆర్థిక సమస్యలతో పాటు ఒంటరి మహిళలు పిల్లలను కనే చట్టాలను ప్రభుత్వం కఠినతరం చేయడంతో జననాల సంఖ్య తగ్గిపోతున్నది. 2022లో వివాహాల సంఖ్య 68 లక్షలు కాగా.. 1986 తర్వాత ఇంత తక్కువగా నమోదు కావడం ఇదే ప్రథమం. 2021తో పోలిస్తే 2022లో పెళ్లి చేసుకునే వారి సంఖ్య 10.5 శాతం తగ్గిపోయింది.

2021 కంటే 2022లో 8 లక్షల పెళ్లిల్లు తక్కువగా అయ్యాయి. జననాల రేటులో ప్రపంచంలోనే అతి తక్కువ స్థానానికి చైనా పడిపోయింది 2022లో రికార్డ్ స్థాయిలో 1.09గా నమోదు కావడం గమనార్హం. పిల్లల సంరక్షణకు అధిక ఖర్చు కావడం వల్ల చాలా మంది తల్లులు ఎక్కువ మంది పిల్లలను కనడం లేదు. అదీగాక మహిళల పట్ల వివక్ష కూడా ఇందుకు శాపంగా మారింది.

Updated On 29 Aug 2023 1:47 AM GMT
Ehatv

Ehatv

Next Story