Youtube : ఇకపై యూ ట్యూబ్ షార్ట్స్ నిడివి మూడు నిమిషాలు!
వీడియో స్ట్రీమింగ్ ఫ్లాట్‌ఫామ్‌లలో యూ ట్యూబ్‌కు(Youtube) ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.
వీడియో స్ట్రీమింగ్ ఫ్లాట్‌ఫామ్‌లలో యూ ట్యూబ్‌కు(Youtube) ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. యూ ట్యూబ్ చూడనిదే చాలా మందికి పొద్దుపోదు. వయసుతో సబంధం లేకుండా అందరూ యూ ట్యూబ్ వీడియోలను ఎంజాయ్ చేస్తుంటారు. పెరుగుతున్న జనాదరణను దృష్టిలో పెట్టుకుని యూ ట్యూబ్‌లో కూడా ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు జరుగుతుంటాయి. కొత్త కొత్త ఫీచర్లను ప్రేక్షకులకు పరిచయం చేస్తూ ఉంటుంది. లేటెస్ట్‌గా యూట్యూబ్ వీక్షకులకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. షార్ట్స్ వీడియోల(Shorts) (YouTube Shorts) నిడివిని పెంచింది. యూట్యూబ్‌లో నెటిజన్లను ఎక్కువగా ఆకట్టుకునే ఫీచర్లలో షార్ట్స్ వీడియోలు ఒకటని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటి వరకూ 60 సెకెన్ల వరకూ ఉన్న షార్ట్స్ మాత్రమే అప్‌లోడ్ చేసుకునే వీలుండేది. అయితే, ఈ నిడివిని మూడు నిమిషాల వరకూ పెంచింది యూ ట్యూబ్. ఈ నిబంధన అక్టోబర్ 15 నుంచి అందుబాటులోకి రానుంది.