Yevgeny Prigogine : ప్రిగోజిన్ పేరు వింటేనే రష్యా బెంబేలెత్తుతోంది.... ఇంతకీ ఎవరీ ప్రిగోజిన్... ? పుతిన్‌తో ఏమిటి సంబంధం?
ఉక్రెయిన్‌పై(ukraine) దాడికి దిగిన రష్యాకు(Russia) నిన్న మొన్నటి వరకు వాగ్నర్ గ్రూపు(Wagner group) అండగా నిలిచింది. వాగ్నర్ కిరాయి సైన్యం చీఫ్ యెవ్జెనీ ప్రిగోజిన్(Yevgeny Prigogine) తిరుగుబాటు జెండా ఎగరేశాడు. పుతిన్(Putin) సైనిక నాయకత్వాన్ని కూల్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ఉక్రెయిన్‌లో తమ బలగాలకు అడుగడుగునా ఎదురవుతున్న సవాళ్ల విషయంలో రష్యా రక్షణ శాఖ పట్టించుకోకపోవడంతో ప్రిగోజిన్(Prigozine) అసంతృప్తితో రగిలిపోయారు. అందుకే ఈ నిర్ణయం చేసుకున్నారు.
ఉక్రెయిన్‌పై(ukraine) దాడికి దిగిన రష్యాకు(Russia) నిన్న మొన్నటి వరకు వాగ్నర్ గ్రూపు(Wagner group) అండగా నిలిచింది. వాగ్నర్ కిరాయి సైన్యం చీఫ్ యెవ్జెనీ ప్రిగోజిన్(Yevgeny Prigogine) తిరుగుబాటు జెండా ఎగరేశాడు. పుతిన్(Putin) సైనిక నాయకత్వాన్ని కూల్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ఉక్రెయిన్‌లో తమ బలగాలకు అడుగడుగునా ఎదురవుతున్న సవాళ్ల విషయంలో రష్యా రక్షణ శాఖ పట్టించుకోకపోవడంతో ప్రిగోజిన్(Prigozine) అసంతృప్తితో రగిలిపోయారు. అందుకే ఈ నిర్ణయం చేసుకున్నారు. ఇదే సమయంలో ప్రిగోజిన్‌పై రష్యా కత్తులు దూసింది. ఆయనపై సాయుధ తిరుగుబాటు ఆరోపణలు చేసి అరెస్ట్‌కు(Arrest) ఆదేశించింది.
ఈ పరిణామంతో ప్రిగోజిన్ మరింత మండిపోయారు. రష్యా సైన్యంపై ప్రతిదాడికి ఆదేశాలిచ్చారు. రష్యాలో వినాశనం తప్పదంటూ హెచ్చరించారు. 'మా సైన్యంలోని పాతికవేల మందిమి చావడానికి సిద్ధంగా ఉన్నాం. రష్యా కోసం ఏమైనా చేస్తాం. మేము ఇంకా ముందుకు వెళతారం. అడ్డొచ్చిన ప్రతీది నాశనం చేస్తాం' అంటూ ప్రిగోజిన్ ఓ ఆడియో సందేశాన్ని(Audio Message) పంపించాడు. ఇప్పటకే వార్నర్ గ్రూపు రోస్తోవ్ రీజియన్‌లోకి అడుగుపెట్టిందని ప్రకటించారు.
ఒకప్పుడు పుతిన్‌కు సన్నిహితంగా ఉండేది వాగ్నర్ ప్రైవేటు సైన్యం.
రష్యాతో కలిసి ఉక్రెయిన్‌పై పోరాటం జరిపింది. రష్యాలో ఒలిగార్కర్‌లది బలమైన వర్గం.వారి చేతుల్లోనే ఖనిజాలు, ఇంధనం వంటివి ఉన్నాయి. ప్రిగోజిన్ కూడా ఒలిగార్కే కానీ, ఈయన చేతిలో ఉన్నది కేవలం ఫుడ్ కాంట్రాక్టులు మాత్రమే. దీంతో పాటు పుతిన్ ప్రైవేటు సైన్యం(Private Army) కూడా ప్రిగోజిన్ చేతుల్లోనే ఉంది. దాని పేరు వాగ్నర్ ప్రైవేటు మిలటరీ కంపెనీ(Wagner Private military Company).. షార్ట్ ఫామ్‌లో పీఎంసీ. ఇందులో మొత్తం కిరాయి సైనికులే(Mercenaries) ఉంటారు. వీరు రష్యాకు, పుతిన్‌కు విదేశాల్లో అవసరమైన లక్ష్యాలను సాధించడానికి రహస్యంగా పనిచేస్తారు.
ఉక్రెయిన్‌లోని బఖుముత్ నగరాన్ని రష్యా కైవసం చేసుకోవడంలో వాగ్నర్ ప్రైవేటు మిలటరీ కంపెనీదే కీలకపాత్ర.. పుతిన్‌కు ప్రిగోజిన్ చాలా దగ్గర. ఈయనను పుతిన్ షెఫ్‌గా వ్యవహరిస్తుంటారు. పుతిన్ ఆంతరంగికుల్లో ప్రిగోజిన్ కూడా ఒకరు. 1980ల్లో దొంగతనం, దోపిడీ కేసులలో సుమారు తొమ్మిదేళ్లు జైలుకు వెళ్లి వచ్చాడు. జైలు నుంచి బయటకు వచ్చాక హాడ్‌డాగ్స్(Hotdogs) అమ్ముతూ జీవనం కొనసాగించాడు. అటుపై సెయింట్ పీటర్‌బర్గ్‌లో ఖరీదైన రెస్టారెంట్లను తెరిచాడు. 90లలో పుతిన్‌తో పరిచయం ఏర్పడింది. 2000లో పుతిన్ రష్యా అధ్యక్షుడయ్యారు.
అదే సమయంలో ప్రిగోజిన్ తన వ్యాపారాలను విస్తరించుకుంటూ వెళ్లారు. రష్యా సర్కారుకు చెందిన సైనిక, పాఠశాల ఫుడ్ కాంట్రాక్టులు ఈయనకే దక్కాయి. 2016లో అమెరికా ఈయనపై ఆంక్షలు విధించింది. ఆ నాటి ఎన్నికల్లో ట్రంప్‌కు అనుకూలంగా ప్రిగోజిన్ ప్రచారం చేయించారట.
ఈ ఏడాది జనవరిలో 62 ఏళ్ల ప్రిగోజిన్.. రష్యా సైన్యానికి తోడుగా ప్రైవేట్ సైన్యం వాగ్నర్‌తో ఉక్రెయిన్ యుద్ధంలో భాగం పంచుకుంటూ వస్తున్నాడు.
ఉక్రెయిన్‌లోనే కాదు.. ప్రపంచంలోని పలు దేశాల్లో వాగ్నర్ గ్రూప్ కదలికలు ఉన్నాయి. లిబియా సివిల్ వార్(Libya Civil War), సిరియా(Syria), మోజాంబిక్(Mozambique), మాలి(Mali), సుడాన్(Sudan), ది సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్(the centrak africa republic), వెనుజువెలా వంటి దేశాల్లో వాగ్నర్ గ్రూప్ ఉంది. ముఖ్యంగా సిరియాలో రష్యా అనుకూల బషర్ అల్ అసద్ ప్రభుత్వాన్ని కాపాడటంలో వాగ్నర్ గ్రూప్ రష్యా సైన్యంతో కలిసి పనిచేసింది. పాల్మార్ ప్రాంతం స్వాధీనంలోనూ వీరు ఉన్నారు. ఉక్రెయిన్‌లోనూ రష్యాకు అండగా పోరాడింది.