2024లో అమెరికాలో(america) జరిగే అధ్యక్ష ఎన్నికలకు(President Elections) సంబంధించి రిపబ్లికన్ పార్టీ(Republic Party) అభ్యర్థిపై రాయిటర్స్ ఇప్సోస్‌ ఒపినీయన్‌ పోల్‌(Opinion poll) నిర్వహించింది. ఈ ఒపీనియన్ పోల్‌లో ట్రంప్‌(Trump) ఆధిక్యత కొనసాగుతోంది. దాదాపు 61 శాతం మంది రిపబ్లికన్లు ట్రంప్‌ వైపు మొగ్గు చూపినట్లు ఒపీనియన్‌ పోల్‌ ప్రకటించింది.

2024లో అమెరికాలో(america) జరిగే అధ్యక్ష ఎన్నికలకు(President Elections) సంబంధించి రిపబ్లికన్ పార్టీ(Republic Party) అభ్యర్థిపై రాయిటర్స్ ఇప్సోస్‌ ఒపినీయన్‌ పోల్‌(Opinion poll) నిర్వహించింది. ఈ ఒపీనియన్ పోల్‌లో ట్రంప్‌(Trump) ఆధిక్యత కొనసాగుతోంది. దాదాపు 61 శాతం మంది రిపబ్లికన్లు ట్రంప్‌ వైపు మొగ్గు చూపినట్లు ఒపీనియన్‌ పోల్‌ ప్రకటించింది. స్వీయ గుర్తింపు ఉన్న రిపబ్లికన్లు అమెరికా అధ్యక్షుడు, డమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్‌ను(Joe Bidden) ఎదుర్కోవాలంటే ట్రంపే సరైన అభ్యర్థి అని భావిస్తున్నారని తెలిపింది. ఈ సర్వేలో ట్రంప్‌ తర్వాత ఫ్లోరిడా గవర్నర్‌ రాన్‌ డిసాంటిస్(Ron DeSantis), సౌత్‌ కరోలినా మాజీ గవర్నర్‌ నిక్కీ హేలీకి చెరో 11 శాతం మంది రిపబ్లికన్లు మద్దతు తెలిపారు. పారిశ్రామికవేత్త, భారత సంతతికి చెందిన వివేక్‌ రామస్వామికి కేవలం 5 శాతం మంది రిపబ్లికన్లే మద్దతు ఇచ్చారు. న్యూజెర్సీ మాజీ గవర్నర్‌ క్రిస్ క్రిస్టీకి 2 శాతం మంది రిపబ్లికన్లు మద్దతు పలికారు.

2024 అధ్యక్ష ఎన్నికల్లో తొలి పోలింగ్ జనవరి 15న అయోవా రిపబ్లికన్ కాకస్‌లో నిర్వహించనున్నారు. యూఎస్‌ క్యాపిటల్‌పై దాడి చేయడానికి ట్రంప్‌ మద్దతుదారులు ప్రయత్నించిన వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని మూడో వంతు రిపబ్లికన్లు సర్వేలో చెప్పారు. ట్రంప్‌ను వ్యతిరేకిస్తున్న నిక్కీ హేలీ ర్యాంకింగ్స్‌లో తన స్థానాన్ని మెరుగుపర్చుకున్నారు. డిసెంబర్ 5 నుంచి 11 మధ్య 1689 మంది గుర్తింపు పొందిన రిపబ్లికన్లతో సర్వే చేయడం జరిగింది.

Updated On 12 Dec 2023 6:49 AM GMT
Ehatv

Ehatv

Next Story