ప్రపంచంలోనే అతిపెద్ద అపార్ట్‌మెంట్ చైనాలో నిర్మించారు. ఈ అపార్ట్‌మెంట్‌లో 30 వేల మంది వరకు నివసించవచ్చు.

ప్రపంచంలోనే అతిపెద్ద అపార్ట్‌మెంట్ చైనాలో నిర్మించారు. ఈ అపార్ట్‌మెంట్‌లో 30 వేల మంది వరకు నివసించవచ్చు. ఇందులో మొత్తం 20 వేల మందికిపైగా నివసిస్తున్నారు. రీజెంట్‌ ఇంటర్నేషనల్‌(Regent International) అపార్ట్‌మెంట్‌ చైనా(China)లోని కియాన్‌జియాంగ్‌ సెంచురీ నగరంలో ఉంది. 675 అడుగుల ఎత్తైన ఈ బహుళ అంతస్తుల భవనం అత్యంత ఎత్తయినదిగా నిలిచింది. 14 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో S ఆకారంలో అద్భుతంగా ఈ భవనాన్ని నిర్మించారు. ఈ భారీ నిర్మాణంలో అనే వసతులు కలిగి ఉన్నాయి. ఇందులోనే షాపింగ్ మాల్స్, స్కూళ్లు, రెస్టారెంట్లు, ఆస్పత్రులు, నిత్యావసర షాపులు ఉన్నాయి. ప్రస్తుతం ఈ భవంతిలో 20 వేల మంది నివాసం ఉంటున్నారు. మరో 10 వేల మందిని అకామిడేట్‌ చేసే అవకాశం ఉంది. ఇక ఇందులో విస్తీర్ణాన్ని బట్టి రూ.18 వేల నుంచి రూ.50 వేల వరకు అద్దె ఉంది. ఇంత పెద్ద అపార్ట్‌మెంట్‌ను 2013లో నిర్మించినా దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ehatv

ehatv

Next Story