దాహం తీర్చుకోవడానికి గుక్కెడు మంచినీళ్లు కూడా దొరకని దుర్భర పరిస్థితులు పొంచి ఉన్నాయి. ఇన్నేసి వానలు వస్తున్నాయిగా ఇక మంచినీటికి కటకట ఎక్కడుంటుంది? అని అనుకోడానికి లేదు. ఎన్ని వానలు కురిసినా, వరదలు పోటెత్తినా నీటికి కటకట తప్పదు. ప్రపంచంలోని పాతిక దేశాలు బిందెడు నీటి కోసం అష్టకష్టాలు పడుతున్నాయని వరల్డ్‌ రిసోర్సెస్‌ ఇన్‌స్టిట్యూట్‌ అంటోంది.

దాహం తీర్చుకోవడానికి గుక్కెడు మంచినీళ్లు కూడా దొరకని దుర్భర పరిస్థితులు పొంచి ఉన్నాయి. ఇన్నేసి వానలు వస్తున్నాయిగా ఇక మంచినీటికి కటకట ఎక్కడుంటుంది? అని అనుకోడానికి లేదు. ఎన్ని వానలు కురిసినా, వరదలు పోటెత్తినా నీటికి కటకట తప్పదు. ప్రపంచంలోని పాతిక దేశాలు బిందెడు నీటి కోసం అష్టకష్టాలు పడుతున్నాయని వరల్డ్‌ రిసోర్సెస్‌ ఇన్‌స్టిట్యూట్‌ అంటోంది. ఈ జాబితాలో మన దేశంతో పాటు బహ్రెయిన్, సైప్రస్, కువైట్, లెబనాన్, ఒమన్, ఖతర్, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్, ఈజిప్టు, లిబియా, యెమన్, బోత్సా్వనా, ఇరాన్, జోర్డాన్, చిలీ, శాన్‌ మారినో, బెల్జియం, గ్రీస్, టునిషియా, నమీబియా, దక్షిణాఫ్రికా, ఇరాక్, సిరియా ఉన్నాయి. అడ్వకేట్‌ వాటర్‌ రిస్క్‌ అట్లాస్‌ పేరుతో వరల్డ్‌ రిసోర్సెస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఓ నివేదిక విడుదల చేసింది. ప్రపంచ జనాభాలో పాతిక శాతం మంది అత్యంత నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని నివేదికలో తెలిపింది. దిగ్భ్రాంతి కలిగించే విషయమేమిటంటే ఈ పాతిక దేశాల్లో మన భారత్‌ కూడా ఉండటం! మనతో పాటు సౌదీ అరేబియా, చిలీ, శాన్‌మెరినో, బెల్జియం, గ్రీస్‌ వంటి దేశాలు కూడా నీటి కొరతను ఎదుర్కొంటున్నాయి. ఇక బహ్రెయిన్‌, సైప్రస్‌, కువైట్‌, లెబనాన్‌, ఒమన్‌ దేశాలు ప్రతీ ఏడాది నీటి కొరతతో అవస్థలు పడుతున్నాయి. ప్రతి సంవత్సరం ఆ దేశాలను కరువు కాటకాలు పట్టి పీడిస్తున్నాయి. పశ్చిమ ఆసియా, ఉత్తర ఆఫ్రికా ప్రాంతాలు ప్రపంచంలోనే అత్యధికంగా నీటి కొరతను ఎదుర్కొంటున్నాయి. ఈ ప్రాంతాల్లో 83 శాతం జనాభా అత్యధికంగా నీటి కొరత సమస్యను ఎదుర్కొంటున్నారు. దక్షిణాసియాకు కూడా నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దక్షిణాసియా దేశాలలో 74 శాతం మంది నీటి కొరత ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో నివసిస్తున్నారు. ప్రపంచ జనాభాలో సగానికి సగం మంది అంటే నాలుగు వందల కోట్ల మంది ప్రతీ ఏడాది ఓ నెల రోజుల పాటు నీటికి తెగ ఇబ్బంది పడుతున్నారని తేలింది. 2050 నాటికి వీరి సంఖ్య 60 శాతం కంటే ఎక్కువే ఉండవచ్చని అనుకుంటున్నారు. దేశాల ఆర్థిక వ్యవస్థలపై నీటి కొరత పరోక్షంగా ప్రభావం చూపుతోంది. భారత్‌, మెక్సికో, ఈజిప్టు, టర్కీ దేశాలు నీటి కొరత కారనంగా ఆర్ధికంగా భారీగా నష్టపోతున్నాయి. ఆసియా దేశాలలో అత్యధికంగా నీటి కొరతను ఎదుర్కొంటున్న దేశం ఇండియానే! 2050 నాటికి ఆసియా దేశాలలో 80 శాతం మందికి సురక్షిత నీరు అందదని నివేదిక చెబుతోంది. ప్రపంచ వ్యవసాయరంగం 60 శాతం నీటి కొరతను ఎదుర్కొంటోంది. ఫలితంగా వరి, గోధుమ, మొక్కజొన్న, చెరకు వంటి పంటల ఉత్పత్తి క్రమంగా తగ్గుతోంది. ఉన్న చెరువులను కబ్జా చేస్తున్నాం. నదులను కూడా ఆక్రమించేస్తున్నాం. చెట్లను నరికేస్తున్నాం. నీటి కొరతకు ఇవే కారణాలు కావు. పెరుగుతోన్న జనాభా, పట్టణీకరణ, పారిశ్రామికీకరణలు వాతావరణాన్ని దెబ్బ తీస్తున్నాయి. పర్యావరణం నాశనం అవుతోంది. నీటి నిర్వహణ మనకు చేతకావడం లేదు. ఇవన్నీ జల సంక్షోభానికి కారణాలవుతున్నాయి. భూమి 70 శాతం వరకు నీటితో నిండి ఉందని సంబరపడటమే కానీ. అందులో మన అవసరాలు తీర్చే నీరు కేవలం మూడు శాతమే! మళ్లీ ఇందులో రెండింట మూడొంతులు మంచు రూపంలో ఉంది. ఈ కాసింత నీటినే మనమంతా పంచుకోవాలి. మరోవైపు జనాభా అనూహ్యంగా పెరుగుతోంది. 1960తో పోలిస్తే నీటికి డిమాండ్‌ రెట్టింపు కంటే ఎక్కువయ్యింది. ఆఫ్రికా దేశాలలో నీటి డిమాండ్‌ బాగా పెరుగుతోంది. నీటి విలువ తెలిసిన అమెరికా, యూరప్‌ దేశాలలో మాత్రం నీటికి డిమాండ్‌ స్థిరంగా ఉంది. పైగా ఈ దేశాలలో జనాభా కూడా తక్కువే! వాతావరణ మార్పుల కారణంగా ప్రపంచంలో సగం దేశాలు కరువుతో బాధపడుతున్నాయి. నీటిని వృధా చేయకూడదని ఎంత మంది ఎన్ని రకాలుగా చెప్పినా జనం చెవికెక్కించుకోవడం లేదు. ప్రతి వాన చుక్కను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉంది. ప్రస్తుతం వ్యవసాయ, పారిశ్రామిక రంగాలకు 70 శాతం నీటిని వాడాల్సి వస్తున్నది. 2050 నాటికి ప్రపంచ జనసంఖ్య బాగా పెరుగుతుంది. వారి కడుపు నింపాలంటే ఇప్పుటి కంటే 56 శాతం అధికంగా పంటలు పండించాలి. తక్కువ నీటి వాడకంతో పంటలు పండించే టెక్నాలజీని అడాప్ట్‌ చేసుకోకపోతే మాత్రం కష్టమే! భూగర్భ జలాలను పెంపొందించే చర్యలు చేపట్టడం ఎంతో అవసరం. అలాగే గ్లోబల్‌ వార్మింగ్‌ను అదుపు చేయడానికి ప్రపంచ దేశాలు పాటుపడాలి.

Updated On 18 Aug 2023 5:36 AM GMT
Ehatv

Ehatv

Next Story