International Post Day : ఇవాళ అంతర్జాతీయ తపాలా దినోత్సవం
ఇప్పుడుంటే టెక్నాలజీ పెరిగింది. ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా ఇట్టే తెలిసిపోతున్నది. ఈ-మెయిల్స్(Mails) వచ్చిన తర్వాత ఉత్తర ప్రత్యుత్తరాలు(Letters) ఈజీ అయిపోయాయి.
ఇప్పుడుంటే టెక్నాలజీ పెరిగింది. ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా ఇట్టే తెలిసిపోతున్నది. ఈ-మెయిల్స్(Mails) వచ్చిన తర్వాత ఉత్తర ప్రత్యుత్తరాలు(Letters) ఈజీ అయిపోయాయి. సోషల్ మీడియా(Social Media) వచ్చిన తర్వాత క్షణాలలో సమాచారం తెలిసిపోతున్నది. వాట్సప్, ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టా వంటి యాప్‌లతో మన బంధుమిత్రులు ఎక్కడ ఉన్నా నేరుగా మాట్లాడగలుతున్నాం. కొన్ని సంవత్సరాల కిందట ప్రతి ఒక్కరికీ తపాలానే(Postage) కమ్యూనికేషన్ సాధనం.
ఉత్తరం జన జీవితాలతో పెనకేసుకుపోయిన అనుబంధాన్ని వివరిస్తే ఈ జనరేషన్‌కు ఆశ్చర్యం కలిగించవచ్చు. పోస్ట్ అంటూ పోస్ట్‌మన్ వేసే కేక ఇంటిల్లిపాదిని కదిలించేది. ఉత్తరం ఓ భావోద్వేగాల సమ్మేళితం. ఎన్ని సందేశాలను మోసుకువచ్చిందో అది! ఆనంద విషాదాలను ప్రజలకు చేరవేసింది. తోకలేని పిట్ట తొంభై ఆమడలు దూరం పోతుంది అన్న సామెత పుట్టింది అనే సామెతను నిజం చేస్తూ తక్కువ ధరకే సేవలందించింది తపాలా శాఖ.
గ్రామీణ ప్రజలకు ఈ శాఖ చేసిన సేవలు అనన్య సామాన్యం. ప్రపంచంలో ఎక్కడికైనా, మారుమూల ప్రాంతాలకు సైతం ఈ ఉత్తరం వెళ్లే సౌకర్యం కల్పించింది మన దేశ తపాలా వ్యవస్థ(Post Department). మొట్టమొదట 18వ శతాబ్దంలో ఈ వ్యవస్థను ప్రారంభించారు. 1776లో బ్రిటిష్ అధికారి లార్డ్ క్లైవ్ తపాలా వ్యవస్థను ఏర్పాటు చేశారు. 1774లో వారన్ హేస్టింగ్స్ కలకత్తా ఆఫీసును ప్రారంభించగా తర్వాత 1786లో మద్రాస్ జనరల్ పోస్టాఫీసును, 1793లో బొంబాయి జనరల్ పోస్ట్ ఆఫీస్‌లను ఏర్పాటు చేశారు.
స్వాతంత్య్రం వచ్చినప్పుడు దేశంలో 23,344 తపాలా కార్యాలయాలు ఉండేవి. ప్రపంచంలోనే అతిపెద్ద తపాలా వ్యవస్థ ఉన్న దేశంగా మన దేశం రికార్డు సాధించింది. మారుమూల ప్రాంతాలకు సైతం ఉత్తరం వెళ్లే విధంగా పోస్టల్ శాఖ తన సేవలను 1854లో ప్రారంభించింది.స్విట్జర్లాండ్‌లోని బెర్న్‌లో 1874లో యూనివర్సల్ పోస్టల్ యూనియన్ అక్టోబరు 9న ఏర్పడింది. దీనికి గుర్తుగా, ఐక్యరాజ్య సమితి చేపట్టిన తీర్మానాన్ని అనుసరించి ప్రతి సంవత్సరం అక్టోబర్ 9వ తేదీని అంతర్జాతీయ తపాలా దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది.