ఓ బ్రహ్మాండమైన ఆడిటోరియంను(Auditorium) కట్టడానికి ఎంత ఖర్చు అవుతుంది? ఎక్కువలో ఎక్కువ అయిదు వందల కోట్ల రూపాయలు..ల్యాండ్‌ వాల్యూ ఎక్కువగా ఉంటే మాత్రం మరో అయిదు వందల కోట్లు అవుతుంది. కాని అమెరికాలో ఓ వేదికను నిర్మించారు.

ఓ బ్రహ్మాండమైన ఆడిటోరియంను(Auditorium) కట్టడానికి ఎంత ఖర్చు అవుతుంది? ఎక్కువలో ఎక్కువ అయిదు వందల కోట్ల రూపాయలు..ల్యాండ్‌ వాల్యూ ఎక్కువగా ఉంటే మాత్రం మరో అయిదు వందల కోట్లు అవుతుంది. కాని అమెరికాలో ఓ వేదికను నిర్మించారు. దీనికి అయిన ఖర్చు 2.3 బిలియన్‌ డాలర్లు. మన కరెన్సీలో చెప్పాలంటే 19 వేల కోట్ల రూపాయలపైనే! ఆ భవంతి పేరు ద స్పియర్‌(The Spear). గోళాకృతిలో నిర్మించారు కాబట్టే ఆ పేరు పెట్టారు. అన్నట్టు ప్రపంచంలో ఇంతకు మించిన గోళాకారపు భవంతి లేదు.

మనం 3డీలో సినిమా చూసేందుకు వెళితే స్పెషల్‌ 3 డీ గ్లాసెస్‌ ఇస్తుంటారు. కానీ ఈ థియేటర్‌లాంటి వేదికలో మాత్రం ఎలాంటి గ్లాసెస్‌ అవసరం లేదు. అవి లేకుండానే 4డీ అనుభూతులు కలుగుతాయి. లోపలే కాదు. బయట కూడా ఈ వేదిక రంగులు వెదజిమ్ముతూ ఉంటుంది. పైన, లోపలి భాగాలలో విశాలమైన ఎల్‌ఈడీ స్క్రీన్‌లను ఏర్పాటు చేశారు. ఎల్‌ఈడీ స్క్రీన్ల వెలుగులతో భవంతి ఆకర్షణీయంగా కనిపిస్తోంది. లోపల ఏర్పాటు చేసిన తెరమీద ఏదైనా వీడియో ప్లే చేస్తుంటే మనం కూడా ఆ వీడియోలో ఉన్న ప్రదేశంలో ఉన్నామేమో అన్న అనుభూతి కలిగేలా స్క్రీన్ల అమరిక ఉంది.

మొన్నీ మధ్యనే ది స్పియర్‌ ప్రారంభమయ్యింది. ఈ థియేటర్‌కు సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. నిజానికి ఈ థియేటర్‌ అసలు పేరు ఎమ్‌ఎస్‌జీ స్పియర్‌.. లాస్‌ వెగాస్‌కు(Log Vegas) సమీపంలోని ప్యారడైజ్‌లో(Paradise) ఉన్న ఈ వేదికలో ఏదైనా షోలు నిర్వహించుకోవచ్చు.

కచేరీలు జరుపుకోవచ్చు. వేడుకలు చేసుకోవచ్చు. పాపులస్‌ అనే సంస్థ నిర్మించిన ది స్పియర్‌ ఎత్తు 366 అడుగులు. వెడల్పు 516 అడుగులు ఉంటుంది. మొత్తం 18,600 సీట్ల సామర్థ్యం ఉన్న ఈ స్పియర్‌ వేదిక వెలుపల భాగంలో 5 లక్షల 80 వేల చదరపు అడుగుల ఎల్‌ఈడీ స్క్రీన్‌లు(LED Screens) ఉన్నాయి. స్పీకర్లు వేవ్‌ఫీల్డ్‌(Wave field), సింథసిస్‌ టెక్నాలజీతో(synthesis Thechnology) ఉన్నాయి.

Updated On 18 Oct 2023 6:31 AM GMT
Ehatv

Ehatv

Next Story