Pak Army Chief Warns Imran Khan's Supporters : మాజీ ప్రధాని ఇమ్రాన్ మద్దతుదారులకు ఆర్మీ చీఫ్ హెచ్చరిక
పాకిస్థాన్‌లో పరిస్థితి రోజరోజుకు దారుణంగా దిగజారుతోంది. ఇప్పటికే ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న దేశంలో.. ప్రభుత్వం, ప్రతిపక్ష పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం తీవ్రరూపం దాల్చింది. గత కొద్ది రోజులుగా, ప్రధాన ప్రతిపక్ష పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) అధినేత ఇమ్రాన్ ఖాన్‌పై ప్రభుత్వం ప్రారంభించిన విమర్శల దాడి దేశంలో పరిస్థితిని మరింత దిగజార్చింది.
పాకిస్థాన్(Pakisthan)లో పరిస్థితి రోజరోజుకు దారుణంగా దిగజారుతోంది. ఇప్పటికే ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న దేశంలో.. ప్రభుత్వం, ప్రతిపక్ష పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం తీవ్రరూపం దాల్చింది. గత కొద్ది రోజులుగా, ప్రధాన ప్రతిపక్ష పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (PTI) అధినేత ఇమ్రాన్ ఖాన్‌పై ప్రభుత్వం ప్రారంభించిన విమర్శల దాడి దేశంలో పరిస్థితిని మరింత దిగజార్చింది. ఇమ్రాన్(Imran Khan) అరెస్టు, నిరసన ప్రదర్శనలు, ర్యాలీలు పాకిస్తాన్‌లో విపరీతమైన అలజడిని సృష్టించాయి. దీంతో ప్రభుత్వంతో పాటు పాకిస్థాన్ సైన్యం కూడా మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులకు(Imran Khan's Supporters) హెచ్చరికలు(Warning) జారీ చేసింది.స్వయంగా ఆర్మీ చీఫ్(Army Cheif) నుంచే ఆ వార్నింగ్ ఇవ్వడం విశేషం.
మే 9న సైనిక స్థావరాలపై దాడులు జరిపిన తీరును ఎట్టిపరిస్థితుల్లోనూ సహించేది లేదని పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్(Pakistan Chief of Army Staff ) అసిమ్ మునీర్(Asim Munir) అన్నారు. సియాల్‌కోట్‌లోని దండును సందర్శించిన ఆర్మీ చీఫ్.. మన అమరవీరులను, వారికి సంబంధించిన స్మారక చిహ్నాలను(Martyrs' Monuments) అపవిత్రం చేయడానికి ఎవరినీ అనుమతించబోమని అన్నారు. వారు సైన్యానికి, చట్టానికి, ప్రభుత్వానికి ప్రేరణ, గర్వకారణం అని అన్నారు.
ప్రత్యేక కార్ప్స్ కమాండర్ల సమావేశంలో పాల్గొన్న ఆయన.. సైనిక సంస్థాపనలు, ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను నాశనం చేయడాన్ని ఖండించారు. "ఇప్పటివరకు సేకరించిన సాక్ష్యాధారాల ఆధారంగా.. సాయుధ బలగాలకు ఈ దాడులకు కుట్రదారులు, ప్రేరేపించేవారు, నేరస్థుల గురించి బాగా తెలుసు. దాడులు నిర్వహించి వారిపై చర్యలు తీసుకోవాలని నిశ్చయించుకున్నాయి" అని ప్రకటన పేర్కొంది. ఈ విషయంలో దృష్టి మరల్చే ప్రయత్నాలు పూర్తిగా ఫలించవని హెచ్చరించారు.
మంగళవారం (మే 9) ఇస్లామాబాద్ హైకోర్టు కాంప్లెక్స్‌లో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను రేంజర్లు అరెస్టు చేయడంతో పాకిస్తాన్‌లో అశాంతి ఏర్పడింది. ఇది శుక్రవారం వరకు కొనసాగింది. నిరసనకారుల దాడులలో అనేక మంది మరణించారు. ప్రభుత్వ ఆస్తులు చాలావరకూ ధ్వంసమయ్యాయి. దేశ చరిత్రలో తొలిసారిగా ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు రావల్పిండిలోని ఆర్మీ ప్రధాన కార్యాలయాన్ని(Army Office) ముట్టడించారు. లాహోర్(Lahore)లోని చారిత్రక కార్ప్స్ కమాండర్ హౌస్‌ను తగులబెట్టారు. ఇప్పుడు ఈ అల్లర్లకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సైన్యం ప్రకటించింది.