ఇవాళ్లి నుంచి మహిళల ఆసియా కప్‌ క్రికెట్‌(Women Asia Cup Cricket) - 2024 టోర్నమెంట్‌ ప్రారంభమవుతోంది.

ఇవాళ్లి నుంచి మహిళల ఆసియా కప్‌ క్రికెట్‌(Women Asia Cup Cricket) - 2024 టోర్నమెంట్‌ ప్రారంభమవుతోంది. ఈ సందర్భంగా జరిగే మొదటి మ్యాచ్‌లో భారత్‌(India)-పాకిస్తాన్‌(Pakistan) తలపడనున్నాయి. శ్రీలంక(srilanka) లోని దంబుల్లా వేదికగా రాత్రి ఏడు గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. స్టార్ స్పోర్ట్స్ ఛానల్‌తో పాటు హాట్‌ స్టార్‌లో వీక్షించవచ్చు.. ఇంటర్నేషనల్ ఉమెన్‌ టీ-20 క్రికెట్‌లో భారత్, పాకిస్తాన్ ఇప్పటివరకు 14 సార్లు పోటీపడ్డాయి. ఇందులో భారత్ 11 మ్యాచ్‌లలో విజయం సాధించింది. పాక్ మూడు మ్యాచ్‌లలో గెలుపొందింది. ఇప్పటి వరకు ఈ టోర్నమెంట్‌లో ఎనిమిది ఎడిషన్లు జరిగాయి. ఆసియా కప్‌ను భారత్‌ ఏడు సార్లు గెల్చుకోవడం విశేషం. మరోవైపు హర్మన్‌ప్రీత్ సారథ్యంలోని భారత జట్టు మహిళల జట్టు నాలుగు టీ-20 టైటిళ్లలో మూడింటిని, 50 ఓవర్ల ఫార్మాట్‌లో నాలుగింటిని గెలుచుకుంది.

Eha Tv

Eha Tv

Next Story