ఎస్కలేటర్‌లో పొరపాటున కాలు ఇరుక్కుపోయిందో మహిళకు.. ఇరుక్కుపోయిన కాలును బయటకు తీయడానికి చాలా కష్టపడ్డారు. ఇక లాభం లేదనుకుని మహిళ మోకాలి పైభాగం వరకు తొలగించారు.. ఈ దారుణ ఘటన థాయ్‌లాండ్‌లోని డాన్‌ ముయాంగ్‌ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో జరిగింది. పర్యాటక కేంద్రమైన బ్యాంకాక్‌ ఎయిర్‌పోర్ట్‌లో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడంతో పర్యాటకులు ఆందోళన చెందుతున్నారు.

ఎక్స్ లేటర్‌లో పొరపాటున కాలు ఇరుక్కుపోయిందో మహిళకు.. ఇరుక్కుపోయిన కాలును బయటకు తీయడానికి చాలా కష్టపడ్డారు. ఇక లాభం లేదనుకుని మహిళ మోకాలి పైభాగం వరకు తొలగించారు.. ఈ దారుణ ఘటన థాయ్‌లాండ్‌లోని డాన్‌ ముయాంగ్‌ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో జరిగింది. పర్యాటక కేంద్రమైన బ్యాంకాక్‌ ఎయిర్‌పోర్ట్‌లో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడంతో పర్యాటకులు ఆందోళన చెందుతున్నారు. నఖోన్‌ సి తమ్మారత్‌ వెళుతోన్న 57 ఏళ్ల ఓ మహిళ ఎస్కలేటర్‌ ఎక్కారు. కాసేపయ్యాక ఉన్నట్టుండి ఆమె కాలు ఎస్కలేటర్‌ లోపల ఇరుక్కుపోయింది. చాలా సేపు నొప్పితో బాధపడింది. ఆమెను రక్షించడానికి ఎయిర్‌పోర్ట్ సిబ్బంది, డాక్టర్లు చాలా ప్రయత్నించారు. అయినా లాభం లేకపోయింది. చివరి ప్రయత్నంలో ఆమె కాలును మోకాలి పైభాగం వరకు తొలగించారు. తర్వాత దగ్గరలో ఉన్న బుమ్రుంగ్రాండ్‌ అంతర్జాతీయ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణం ఏమిటన్నదానిపై దర్యాప్తు జరుగుతోందని, మళ్లీ ఇలాంటి సంఘటనలు జరగకుండా చూస్తామని డాన్‌ ముయాంగ్‌ ఎయిర్‌పోర్ట్‌ డైరెక్టర్‌ కారంత్‌ తనకుల్జీరప్‌ అన్నారు. తమ వల్ల ఆ మహిళకు జరిగిన నష్టానికి సానుభూతి తెలుపుతున్నామన చెప్పారు. జరిగిన తప్పిదానికి తాము పూర్తి బాధ్యత వహిస్తామని, ఆమె వైద్యానికి అయ్యే ఖర్చుతో పాటు ఆమెకు ఎలాంటి పరిహారం కావాలన్నా అందించేందుకు రెడీగా ఉన్నామని కారంత్‌ తెలిపారు. మా అమ్మ పైకి ధైర్యంగానే ఉన్నా కాలు తీసేయడంతో ఆమె గుండె బద్ధలయ్యిందని, ఒకే కాలితో జీవితాంతం ఎలా గడపడం అన్న ఆలోచన ఆమెను లోలోపల తొలిచేస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు ఆమె కుమారుడు.

Updated On 1 July 2023 7:36 AM GMT
Ehatv

Ehatv

Next Story