బ్రిటన్‌లో (Britan)నివాసం ఉంటున్న ఒడిశాకు(Orissa) చెందిన భారతీయ యువతి చేనేత చీరతో పరుగు పందెంలో పాల్గొని అందరి దృష్టిని ఆకర్షించింది. uk లో మాంచెస్టర్‌లో (Manchester )జరిగిన పరుగుపందెంలో పాల్గొని 4 గంటల 50 నిమిషాల్లో ఏకంగా 42.5 కిలోమీటర్లు పరుగెత్తింది.

బ్రిటన్‌లో (Britan)నివాసం ఉంటున్న ఒడిశాకు(Odisha) చెందిన భారతీయ యువతి చేనేత చీరతో పరుగు పందెంలో పాల్గొని అందరి దృష్టిని ఆకర్షించింది. uk లో మాంచెస్టర్‌లో (Manchester )జరిగిన పరుగుపందెంలో పాల్గొని 4 గంటల 50 నిమిషాల్లో ఏకంగా 42.5 కిలోమీటర్లు పరుగెత్తింది.

ఒరిస్సాకు(Orissa) చెందిన 47 ఏళ్ల మధుస్మిత జైన్ (madhusmitha jain)ఉద్యోగరిత్యా బ్రిటన్‌లో స్థిరపడింది. ఆదివారం మాంచెస్టర్‌లో మారథాన్ 2023( Manchester Marathon 2023 )సందర్భంగా నిర్వహించిన ఈ ఈవెంట్‌లో మధుస్మిత అందరిలాస్పోర్ట్స్ డ్రెస్ తో కాకుండా వినూత్నంగా చీరకట్టుకొని పాల్గొనింది. ఒరిస్సాకు చెందిన సంబల్‎పురి ఎరుపు రంగు చేనేత చీరను అందంగా కట్టుకుని రేస్‌లో పరుగులు తీసింది. వినూత్న రీతిలో భారతీయ సంస్కృతిని (Indian Culture)చాటి చెప్పేలా ఆమె చేసిన పనితో అందరి దృష్టిని ఆకర్షించింది . పురుషుల కంటే ఏమాత్రం తగ్గకుండా రన్నింగ్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. కేవలం 4 గంటల 50 నిమిషాల్లోనే 42.5 కిలోమీటర్ల దూరాన్ని పరుగెత్తి రికార్డ్ కూడా సృష్టించింది. కాగా, పరుగుపందెంలో అంతా పురుషులే ఉండగా.. మధుస్మిత (Madhu Smitha)ఒక్కతే మహిళ కావడం కూడా మరో విశేషం.

భారతీయ సంస్కృతిని మరచి పాశ్చత్య అలవాట్లకు దాసోహం అవుతున్న ఎంతో మంది యువతకు స్ఫూర్తిగా నిలుస్తూ మధుస్మిత‌ చేసిన సాహసానికి సంబంధించిన ఫొటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. బ్రిటన్‌లో జరిగిన రెండవ అతిపెద్ద మారథాన్‌లో భారత మహిళ అదరగొట్టిందని ఓ నెటిజన్ ఫొటోలు షేర్ చేశారు. ఇక నెటిజన్లు మధుస్మితపై(Madhu Smitha) ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు. ‘‘ఎంతో మనోహరమైన ఫొటో, మన సంస్కృతిని ప్రపంచానికి అద్భుతగా చూపించింది. భారత్‌లో ఉంటూ విదేశీ దస్తులు ధరిస్తున్న వారంతా దయచేసి ఆమెను చూసి నేర్చుకోండి’’ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

Updated On 22 April 2023 6:32 AM GMT
rj sanju

rj sanju

Next Story