Halima Cisse : ఒకే కాన్పులో తొమ్మిది మంది! మరో రెండు నెలల్లో మూడో పుట్టిన రోజు!
ఒకే కాన్పులో ముగ్గురు పుట్టడం చూశాం..నలుగురు పుట్టడం చాలా అరుదుగా చూస్తుంటాం. కానీ ఒకే కాన్పులో తొమ్మిది మంది పుట్టడం మాత్రం పెద్ద వార్తే! పైగా ఆ శిశువులంతా బతకడం అన్నది అత్యంత అరుదైన విషయం. మాలి(Mali) దేశానికి చెందిన హలీమా సిస్సే(Halima Cisse), అబ్దెల్ కాదెర్ ఆర్బీ అనే దంపతులకు ఈ సంతాన సౌభాగ్యం కలిగింది.
ఒకే కాన్పులో ముగ్గురు పుట్టడం చూశాం..నలుగురు పుట్టడం చాలా అరుదుగా చూస్తుంటాం. కానీ ఒకే కాన్పులో తొమ్మిది మంది పుట్టడం మాత్రం పెద్ద వార్తే! పైగా ఆ శిశువులంతా బతకడం అన్నది అత్యంత అరుదైన విషయం. మాలి(Mali) దేశానికి చెందిన హలీమా సిస్సే(Halima Cisse), అబ్దెల్ కాదెర్ ఆర్బీ అనే దంపతులకు ఈ సంతాన సౌభాగ్యం కలిగింది. 2021 మే 4వ తేదీన వీరికి తొమ్మిది మంది జన్మించారు. అత్యంత అరుదైన కేసు కావడంతో ప్రసవం కోసం హలీమా సిస్సేను మొరాకోలోని ప్రత్యేక వైద్య సదుపాయాలున్న హాస్పిటల్‌లో చేర్పించింది మాలి ప్రభుత్వం. వైద్య ఖర్చులన్నీ ప్రభుత్వమే భరించింది. హలీమాకు ఉన్న కొన్ని ఆరోగ్యసమస్యల కారణంగా ఆమెకు 30 వారాల గర్భం ఉన్నప్పుడే సిజేరియన్ చేశారు వైద్యులు. అకాల ప్రసవం కావడంతో ఒక్కొక్కరి బరువు అర కిలో నుంచి కిలో మధ్యలోనే ఉండింది. దీంతో పిల్లలందరినీ 19 నెలల పాటు ఇంక్యుబేటర్లు, ప్రత్యేక వసతులు ఉన్న కేంద్రంలో ఉంచాల్సి వచ్చింది. ఇప్పుడందరూ హాయిగా, ఆరోగ్యంగా, చలాకీగా ఉన్నారు. ఫోటోలో చూస్తున్నాంగా! ఇలా ఒకే కాన్పులో పుట్టిన తొమ్మిది మంది కలలను నోనుప్‌లెట్స్ అంటారట! ఒకే కాన్పులో పుట్టి జీవించిన తొమ్మిది కవలలు కూడా వీరేనట!తొమ్మిది మందిలో అయిగురు అక్కచెల్లెళ్లు ఉంటే నలుగురు అన్నదమ్ములున్నారు. అన్నట్టు వీరికి ఆరేళ్ల ఓ అక్క కూడా ఉంది. మొత్తంగా హలీమాకు పది మంది సంతానం అన్నమాట! అందుకే మరో రెండు నెలలలో మూడో బర్త్‌డేను జరుపుకోనున్న వీరంతా గిన్నిస్ ఛానెల్ ప్రొగ్రామ్‌లో పాల్గొనేందుకు మొదటిసారి ఇటలీ పర్యటనకు వచ్చారు. రికార్డు నెలకొల్పిన వీరి ఫోటోలను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ నిర్వాహకులు విడుదల చేశారు..