China Hubei : పెళ్లికి ముందు యువకుడిగా మారిన యువతి
మహాభారతంలో శిఖండి పాత్ర గురించి తెలుసుగా! ద్రుపదుడికి పుట్టిన కూతురు (పూర్వజన్మలో అంబ) తన ప్రతిజ్క్ష నెరవేర్చుకోవడం కోసం శివనామస్మరణ చేస్తుంది. తపస్సు చేస్తుంది. పురుషుడిగా మారుతుంది. ఇది భారతంలో ఓ కథ. కానీ చైనాలో(china) ఏ దేవుడు వరమియ్యకుండానే యువతి యువకుడిగా మారింది. కొన్ని రోజులలో పెళ్లి చేసుకోవాల్సిన ఆమె తన పొట్టలో వృషణాలు(Testicles) ఉన్నాయని తెలుసుకుని బిత్తరపోయింది.
మహాభారతంలో శిఖండి పాత్ర గురించి తెలుసుగా! ద్రుపదుడికి పుట్టిన కూతురు (పూర్వజన్మలో అంబ) తన ప్రతిజ్క్ష నెరవేర్చుకోవడం కోసం శివనామస్మరణ చేస్తుంది. తపస్సు చేస్తుంది. పురుషుడిగా మారుతుంది. ఇది భారతంలో ఓ కథ. కానీ చైనాలో(china) ఏ దేవుడు వరమియ్యకుండానే యువతి యువకుడిగా మారింది. కొన్ని రోజులలో పెళ్లి చేసుకోవాల్సిన ఆమె తన పొట్టలో వృషణాలు(Testicles) ఉన్నాయని తెలుసుకుని బిత్తరపోయింది. చివరకు ఆపరేషన్ ద్వారా వాటిని తొలగించుకుంది. చైనాలోని హుబీ(hubei ) ప్రావిన్స్‌లో ఈ విచిత్రం చోటు చేసుకుంది. సదరు యువతి పుట్టుకతో వచ్చే ఆడ్రినల్ గ్రంథి వ్యాధితో బాధపడుతున్నదని డాక్టర్లు అంటున్నారు. ఆమె యవ్వనంలో అడుగు పెట్టినప్పటికీ వక్షోజాల పెరుగుదల సరిగా లేకపోవడంతో డాక్టర్లను సంప్రదించారు. డాక్టర్లు క్రోమోజోముల పరీక్ష చేయించాలని సూచించారు. ఆ యువతి తల్లిదండ్రులు మాత్రం ఆ సూచనను పట్టించుకోలేదు. ఏప్రిల్‌లో పెళ్లికి ముందు వైద్య పరీక్షలు చేయించడంతో తమ కూతురు ఆడపిల్ల కాదని, పురుషుడని వారికి తెలిసింది.