న్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో(Cannes Film Festival) అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఉక్రెయిన్‌పై(Ukrain) రష్యా(Russia) చేస్తున్న దాడికి నిరసనగా ఓ మహిళ కేన్స్‌ రెడ్‌ కార్పెట్‌పై ఆందోళన చేసింది. ఉక్రెయిన్‌ జాతీయ జెండా రంగులున్న దుస్తులను ధరించిన ఆమె ఒక్కసారిగా ఎరుపు రంగును తన ఒంటిపై పోసుకుని నిరసన చేపట్టింది. ఉక్రెయిన్‌ రక్తమోడుతోన్నదని చెప్పడానికే ఆమె నకిలీ రక్తంతో ఈ చర్యకు దిగింది.

కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో(Cannes Film Festival) అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఉక్రెయిన్‌పై(Ukrain) రష్యా(Russia) చేస్తున్న దాడికి నిరసనగా ఓ మహిళ కేన్స్‌ రెడ్‌ కార్పెట్‌పై ఆందోళన చేసింది. ఉక్రెయిన్‌ జాతీయ జెండా రంగులున్న దుస్తులను ధరించిన ఆమె ఒక్కసారిగా ఎరుపు రంగును తన ఒంటిపై పోసుకుని నిరసన చేపట్టింది. ఉక్రెయిన్‌ రక్తమోడుతోన్నదని చెప్పడానికే ఆమె నకిలీ రక్తంతో ఈ చర్యకు దిగింది. ఈ హఠాత్పరిణామంతో అక్కడున్నవారు ఉలిక్కిపడ్డారు. చలనచిత్రోత్సవంలో భాగంగా గత ఆదివారం యాసిడ్‌ సినిమా ప్రీమియర్‌ జరిగింది. చిత్ర యూనిట్‌ రెడ్‌ కార్పెట్‌పై నిలబడి ఫోటోలకు పోజులివ్వసాగారు. ఇదే సమయంలో ఉక్రెయిన్‌ జాతీయ జెండాలో ఉన్న నీలం, పసుపు రంగులతో కూడిన దుస్తులు ధరించిన ఓ మహిళ రెడ్‌ కార్పెట్‌పై నడుచుకుంటూ వచ్చింది.

కేన్స్‌ మెట్లపై ఫోటోలకు పోజులిచ్చింది. సడన్‌గా తన వెంట తీసుకొచ్చిన బాటిల్‌ను తెరచి అందులోని రెడ్‌ కలర్‌ను తన తలపై పోసుకుంది. శరీరమంతా రాసుకుంది. ఈ ఘటనతో అక్కడున్న వారితో పాటు భద్రతా సిబ్బంది కూడా ఉలిక్కిపడ్డారు. వెంటనే తేరుకున్న భద్రతా సిబ్బంది ఆ మహిళను అక్కడ్నుంచి బయటకు తీసుకెళ్లారు. ఆమె ఎవరన్నది ఇప్పటి వరకు తెలియరాలేదు. కాకపోతే ఉక్రెయిన్‌ దేశస్తురాలై ఉంటుందని అనుకుంటున్నారు. దీనిపై కేన్స్‌ ప్రతినిధులు కూడా రియాక్ట్ కాలేదు. గత ఏడాది కూడా ఇదే కేన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో ఓ మహిళ ఇలాగే నిరసన చేపట్టింది.

ఉక్రెయిన్‌పై దాడి పేరుతో మహిళలపై రష్యా సైనికులు చేస్తున్న అకృత్యాలకు నిరసనగా మహిళ దుస్తులు చించేసుకుని అర్ధనగ్నంగా నిరసనకు దిగింది. ఆమె ఛాతీ భాగంపై Stop raping us అని సందేశాన్ని పెట్టుకుంది. ఈ సందేశం కూడా ఉక్రెయిన్‌ జెండా రంగులైన నీలం, పసుపు రంగుల్లో ఉంది. మాపై అత్యాచారాలు ఆపండి అని గట్టిగా నినదించింది. అప్పుడు కూడా భద్రతా సిబ్బంది ఆమెను బలవంతంగా బయటకు పంపించారు. వారం రోజుల కిందట కేన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌ ప్రారంభమైంది. అప్పుడు కేన్స్‌ డైరెక్టర్‌ థిర్రీ ఫ్రెమాక్స్‌ ఉక్రెయిన్‌కు తాము అండగా ఉంటామని చెప్పారు. లాస్టియర్‌లాగే ఈసారి కూడా రష్యా ప్రతినిధులు, రష్యా సినిమా కంపెనీలపై నిషేధం విధించారు కేన్స్‌ నిర్వాహకులు. గత ఏడాది కేన్స్‌ చలనచిత్రోత్సవ ప్రారంభ కార్యక్రమంలో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రసంగించిన విషయం తెలిసిందే!

Updated On 23 May 2023 1:44 AM GMT
Ehatv

Ehatv

Next Story