ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశం అమెరికాలో(America) త్వరలో అధ్యక్ష ఎన్నికలు(ELections) జరుగబోతున్నాయి.

ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశం అమెరికాలో(America) త్వరలో అధ్యక్ష ఎన్నికలు(ELections) జరుగబోతున్నాయి. ఈ సారి ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు ట్రంప్‌(Donald Trump), భారత మూలాలున్న కమలా హారిస్(Kamala Harris) తలపడుతున్నారు. అయితే ట్రంప్‌పై జరిగిన హత్యాయత్నం తర్వాత ఆయనపై సానుభూతి పెరిగిందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. గత ఎన్నికల్లో బైడెన్‌పై(Jeo Bidden) కొద్ది పాటి తేడాతో ఓడిపోయిన ట్రంప్‌ ఈ సారి ఈజీగా గెలుస్తారనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు ఆయన మద్దతుదారులు. గత ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌ కోసం భారత ప్రధాని మోడీ కూడా వెళ్లి ప్రచారం చేసి వచ్చారు. మోడీ-ట్రంప్‌ మధ్య సత్సంబంధాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు భారతీయుల(Indian) మెదళ్లలో మెదులుతున్న ప్రశ్న ఏంటంటే ట్రంప్‌ వస్తే భారత్‌కు లాభమా నష్టమా అని.. హెచ్‌1బీ, విద్యార్థి విసాలకు సులభమవుతుందా అని చర్చించుకుంటునక్నారు. అంతేకాకుండా ట్రంప్‌ పార్టీ నుంచి ఉపాధ్యక్ష పదవిలో తెలుగింటి అల్లుడు వాన్స్‌ను బరిలోకి దింపడంతో ఆసక్తి నెలకొంది.

కానీ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అనుసరించిన విధానాలు, ఇప్పుడు ప్రకటిస్తున్న విధానాలు భారత్‌కు అనుకూలంగా ఉండకపోవచ్చనే చర్చ జరుగుతోంది. గతంలో ట్రంప్‌ హయాంలో స్టూడెంట్, హెచ్‌1బీ వీసాదారులు నరకం చూశారని విశ్లేషిస్తున్నారు. హెచ్‌1బీపై ఉన్న వీసాదారులు ఒబామా, బైడెన్‌ హయాంలో మూడేళ్లకోసారి రెన్యూవల్‌ చేసుకునే అవకాశం ఉండేది. కానీ ట్రంప్‌ వచ్చిన తర్వాత పూర్తిగా మార్చి ప్రతి ఏడాదికోసారి హెచ్‌1బీ వీసాదారులు రెన్యూవల్‌ చేసుకునే షరతు విధించారు. దీంతో హెచ్‌1బీ వీసాదారులు మానసికంగా, ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడేవారు. అంతేకాకుండా ట్రంప్‌ హయాంలో హెచ్‌1బీ వీసాలు దాదాపు 40 శాతం రిజెక్టయ్యేవి. ఒబామా, బైడెన్ అడ్మినిస్ట్రేషన్‌లో ప్రీమియం ప్రాసెసింగ్‌ అనేది ఉండేదని, దీని ద్వారా 1300 డాలర్లు చెల్లిస్తే హెచ్‌1బీపై ముందుగానే నిర్ణయం వచ్చేదని, ట్రంప్‌ ఈ ప్రీమియం ప్రాసెసింగ్‌ను ఎత్తివేయడంతో హెచ్‌1బీ వస్తుందో లేదోనని ఆందోళన ఉండేది. అంతేకాకుండా H4EAD ఉంటే వీరిపై ఆధారపడి ఉన్న స్పౌజ్‌లకు ఉద్యోగం చేసుకునే వెసులుబాటు ఉండేది, ట్రంప్‌ వచ్చిన తర్వాత ఈ అవకాశాన్ని ఆయన ఎత్తివేయడంతో భారతీయులకు ఇబ్బందిగా మారింది. కానీ బైడెన్ వచ్చిన తర్వాత పాత పద్దతిలోనే నిబంధనలు చేర్చారు. అయితే ఈ సారి కూడా ట్రంప్‌ వస్తే ఇమ్మిగ్రేషన్ దారులకు మాత్రం ఇబ్బందులు తప్పవని పలువురు ఎన్‌ఆర్‌ఐలు అభిప్రాయపడుతున్నారు. అలాగని కమలా హారిస్‌ కూడా కొన్ని చిన్నచిన్న వెసులుబాట్లు కల్పించే అవకాశం ఉంటుందని, కానీ భారతీయులకు పూర్తి అనుకూలంగా ఉండకపోవచ్చని చెప్తున్నారు.

Updated On 29 Aug 2024 12:00 PM GMT
Eha Tv

Eha Tv

Next Story